అద్దె కొంప కదరా !

ఆశలు ఎందుకురా !!


తొమ్మిది గడపల ఇల్లు !

తొంగి చూడు నీచం రా !!


ఆహారం అద్దె కట్టి !

నిరంతరం నీరు పెట్టి !

పట్టు బట్టలు కట్టి !

పట్టమూ కడితె !

ఏక్షణం కూలునో !

ఎక్కడది రాలునో !!


విందులోన ఆహారం !

ఓహో అంటావు !!


తిన్నాక బయటికొస్తే !

చీ చీ అంటావు !!


పైపైన తోలు చూసి !

ఆహా అంటావు !!


తోలు తీసి లోనచూస్తే !

గుడ్లు తేలేస్తావ్ !!


చెప్పేది నచ్చకుంటే !

వేదాంతం అంటావు !!


అవసరం నీకుంటే !

పొర్లుదండలే పెడతావు !!


ఇదేమి చిత్రం !

సత్యం అంతా తేటతెల్లమై !

కనబడుతున్నా మారని మనుషులు !!


ఏదీ నీతో రాదని తెలుసు !

ఏదీ నీది కాదని తెలుసు !


మాంసపు ముద్ద నువ్వైతే !

మట్టిలోన కలుస్తుంది !!


ఎముకుల గూడు నువ్వైతే !

ఏటి ఒడ్డున కాలుతుంది !!


నేనను అహమే నువ్వైతే !

దాని జాడ తెలియకుంది !!











- స్వస్తీ...