"సప్త ఋషుల తపః సంపదలే పృధ్విపై చల్లిన సంస్కార విజ్ఞాన బీజములు"


"సప్త నదుల ప్రవాహమ్ములే: ఇలలో పెంచే సాగుసంపత్తులు"


"సప్తవర్ణముల ఆవిర్భావమే హరివిల్లు అందించే సొగసులు"


" సప్త పుణ్య క్షేత్రముల ఆవిర్భావమే- భువిలో పెంచే పవిత్ర ఆధ్యాత్మిక సంపత్తులు "


"సప్తదినములతో కూడిన వారమే

భువిలో దివిలో సప్త దేవతల ఆరాధనమే"


"అగ్ని సాక్షిగా నడయాడే సప్తపది నడకలే

వివాహ బంధాన్ని నిలిపే శాశ్వత బంధనాలు"


"సప్తకుల పర్వతముల ప్రతిష్ఠంభనములే భరత భూమిపై నెలకొన్న అఖండ ఖనిజ సంపదలు"


"సప్త గిరులపై వెలసిన శ్రీ శ్రీనివాసుని కృపాకటాక్షములే సర్వ జనతకు పాపహరణములు"


"సప్త చిరంజీవుల ఆవిర్భావమే యుగయుగాల చరిత్రకు ఆదర్శము"


"సప్త పతివ్రతాశిరోమణులే – సతీ లోకానికి కర్తవ్య భోధకులు”


"సప్త మాతృకల దీవనలే అశేష భక్తులకు రక్షణ కవచములు"


“సప్త స్వరముల సమ్మిళతమే సంగీత సామ్రాజ్యానికి స్వరలహరులు”


"సప్త ఊర్ధ్వ లోకములు భువి నుంచి దివికి చేరే ఆరోహణములు"

సప్త అధోలోకములు భువి నుంచి దిగే అవరోహణములు"


" సప్తద్వీపో వసుంధర " 

" సప్త సముద్రములు అనంతనిధులు-యక్ష కిన్నెర కింపురుషాధులు, నానాజగములు, నదీనదములు; మణిద్వీపానికి మహానిధులు "







- స్వస్తీ...