అసంపూర్ణ జీవితానికి 

అనుకోని అతిథిగా 

ఆజన్మాంతము జతగా ఉండే 

ఆత్మ బంధువై


అర్దాంగిగా వచ్చిన 

మరల మరల రాని మరపురాని 

అపురూపమైన అరుదైన 

మధుర వైవాహిక సంపూర్ణ జీవితానికి 

3 వసంతాలు నేటితో...


ఆత్మీయతా అనుబంధాలను 

అందమైన అల్లికగా అమర్చి 

మమతానురాగలను 

మైలురాళ్లుగా మలచి

పంచుకున్న పెంచుకున్న అనుభూతులను 

మధుర జ్ఞాపకాలుగా చేసి

బతుకు బాటలో బంధాలను బాంధవ్యాలను

బహుమతిగా ఇచ్చి,

బాధ్యతలకు, భారాలకు భయపడకుండా 

బహు ఇష్టంగా స్వీకరించి

అవధులు లేని అనుబంధాలను 

అక్కున చేర్చుకొని

అనురాగంతో అల్లుకుని 

అతిథులకు అన్నపూర్ణవై...


దిగులు దుప్పటిలో దాగివున్నప్పుడు, 

రెప్ప పడని క్షణాల్లో

ఓదార్పు పలుకుల పలకరింపుల చినుకులతో 

అలసిన మనసుకు ఆలంబనగా

చిరునవ్వు వెలుగులతో 

స్వాగతం పలుకుతూ


ఆశల తీరాల ప్రయాణం లోని 

అడుగుజాడలలో అండగా, 

ఆసరాగా ఉంటూ

అంతరంగం లోని ఆలోచన తరంగాలకు 

అనునిత్యం ఆత్మ విశ్వాసాన్ని అందిస్తూ


ఆశలకు ఆశయాలకు 

అనంగీకారము అర్దాంగీకారము కాకుండా 

అర్దాంగి గా సంపూర్ణ అంగీకారము అందిస్తూ...


ఆర్భాటాలకు, ఆడంబరాలకు 

ఆమడ దూరంలో 

వాస్తవానికి చేరువ లో ఉంటూ 


ఆర్ధిక సంబంధాలకు 

ఇబ్బంది కలుగకుండా

అందించే సహాయ సహకరాలకు 

జోహార్లు అర్పిస్తూ...


నా అక్షర ప్రవాహానికి ఇంతటితో అడ్డుకట్ట వేస్తూ...


సంసార సాగర సామ్రాజ్యమునకు 

రాణిగా... మహారాణిగా... 

అందుకో 

అభినందన వందనాల మందారమాల 

మన పరిణయ వార్షికోత్సవ శుభాకాంక్షలుగా...


నీ ప్రియాతి ప్రియమైన రామ్...











★ ★ ★