కమనీయ నగరం కాకినాడ.

అసలు పేరు కోకనాడ.

కోకనాడ పేరు రైల్ బండికి ఇచ్చి కాకినాడ గా రూపాoతరం.

తూర్పుగోదావరి జిల్లా కే తలమానికం.

విశ్రాంతి ఉద్యోగుల భూతల స్వర్గం.

మన కాకినాడ నగరం.


నాయకర్ గారి విద్యా భిక్షే M S N చారిటీస్.

సాంకేతిక విద్యకు ఆలవాలం ఆంధ్ర పాలిటెక్నిక్.

అదే సామాన్య విద్యార్థుల పాలిట వరం.

ప్రాంగణం చుట్టూ  క్షార మడుగులు.

లోపల  అన్నీ  విద్యాలయాలు.


తరతరాలుగా ఉప్పుటేరు మీద నిలుచున్న వారధి.

జగన్నాధపురం వారధి.

తరాలు మారినా పెరగని వారథి.

నిత్యం పెరుగుతోంది రద్దీ. పో

చిరు వ్యాపారుల బ్రతుకు రథ జీవన సారధి. 


అతి పెద్ద బోధన ఆసుపత్రి  G G H.

అధునాతన టెక్నాలజీతో సామాన్యుడి వైద్యం.

పనితీరు మొత్తం దేశానికే తలమానికం.

వైద్యో నారాయణో హరి పేరు సార్ధకం .


చెరువులన్నీ చరిత్ర లో మునిగి పోయిన.

బాలాజీ మటుకు T TD వారి మండపంలో.

అదే బాలాజీ చెఱువు.

విత్తనాల నుండి విందుల వరకు దొరికే జంక్షన్.


బ్రిటిష్ వారి కట్టడాలకు మచ్చు తునక కలెక్టర్ బంగ్లా.

తరాలు మారి  రంగులు వెలిసిన గచ్చు పెచ్చు లూడలేదు.


ఆధునిక హంగులు లేని శాంతి భవన్ హోటల్.

అన్నీ  దిల్ పసంద్ అయ్యే రుచు లే.


అతి పురాతన విద్యాలయం పి ఆర్ కాలేజ్.

పి ఆర్ కాలేజ్ అంటే  ప్రెస్టీజియస్ కాలేజ్.

విద్యా దాత పిఠాపురం రాజులు.

ప్రాంగణం అపర సరస్వతీ నిలయం.

విద్యాకుసుమాలు అన్నీ కవిగా కలెక్టరుగా 

యాక్టరుగా డాక్టర్లుగా జీవన  ప్రయాణం.


దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ

ప్రపంచానికి కాలగమనాన్ని తెలిపే నేమాని పంచాంగం.

ఈ వీధి లోనే కాపురం. 

అదే దేవాలయం వీధి.


పెద్దాపురం చాంతాడులా పేద్ద  రోడ్డుమెయిన్ రోడ్డు.

టూ టౌన్ నుండి జగన్నాధపురం బ్రిడ్జి వరకు సాగే రోడ్డు.

విత్తం  ఉండాలేగాని  అన్నీ దొరికే  అందమైన  రోడ్డు.

షాపింగ్ కి అనువైన   పార్కింగ్ కి ప్లేస్  లేని  రోడ్డు.

గోల్డ్ షాప్ లు  ఉండే గోల్డ్ మార్కెట్ సెంటర్

మడతకాజా అమ్మే  మసీద్ సెంటర్.

మెయిన్ రోడ్డు కి  సెంటర్ పాయింట్.


సమస్తం పుస్తకాలమయం జిల్లా గ్రంధాలయం.

సభలు సమావేశాలు నిత్యం జరగడం.

 

  అద్దేపల్లి సుర గాలి మనల్ని వీడిపోవడం మన దురదృష్టం.


పెద్ద బజార్ అంతా షాపులు మయం.

అది పెద్ద మాయా బజార్ .

దాటాలంటే పెద్ద బేజారు.

       

పిండాల మాట కాకికే తెలుసు

నామధేయం మాత్రం పిండాల చెరువు.

ఆ పేరు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలుసు.

చెరువులో ఉన్న అఖిలాండేశ్వరుడు కే తెలుసు.


రెడ్డి గారి  వారధి నుండి  స్వప్న వరకు సినిమాల రోడ్డు.

గోడల నిండా సినిమా వాల్ పోస్టర్లు

విడుదలయ్యే చిత్రాల కోసం క్యూలో యువతలు.

రోడ్డుమీదే  బతుకు చిత్ర  విచిత్రాలు. బుట్టల అల్లికలు.

కళాభిమానుల  మందిరం సూర్య కళా మందిరం.


సుబ్బయ్య గారు సుర లోకం వెళ్లిపోయినా.

బుట్ట భోజనం మాత్రం   కాకినాడ కే అంకితం

చాపల్యం  తీరేది సుబ్బయ్య గారి హోటల్ లోనే.


పెసరట్టు ఉప్మా అందరూ మెచ్చే టిఫిన్.

పొట్టి పెసరట్టు  కాకినాడ కే స్వంతం.

               

 అమ్మలు గన్న అమ్మ నూకాలమ్మ.

 ఆమె గుడి కాకినాడ నడి బొడ్డు కే అలంకారం.


తరతరాలుగా కాకినాడ వాసుల దాహార్తిని తీర్చేది.

కుళాయి చెరువు.

సాయంత్రపు వేళల్లో వాకర్స్ కు నెలవు.


 తన పట్టపు రాణి  మీద  ప్రేమతో ఓ గుడి

అదే  భాను లింగేశ్వరుడి  గుడి భాను గుడి

పిఠాపురం రాజా వారి  కట్టుబడి.

కొండంత పాకo తో కోటయ్య కాజా.

 అందరికీ  కాకినాడ అంటే అదే మజా.

 గుటక గుటక లో రుచి చార్మినార్ టీ.


  భానుగుడి నుండి సర్పవరం జంక్షన్ వరకు సాగే రోడ్డు

 పిఠాపురం వెళ్లే రోడ్డు.

మధ్యలో రిజర్వ్ లైన్, పోలీసుల గృహ సముదాయం.

ఎదురుగా  S P  వారి బస మనకెందుకు భయం.

చాగంటి వారి ప్రహసనం అయ్యప్ప దేవాలయం

దాటితే  రోడ్డుకిరువైపులా రెండు కాలేజిలు.

ఒకటి శస్త్రచికిత్స నేర్పేది. 

రెండోది యంత్ర చికిత్స నేర్పేది.

రంగరాయ మెడికల్ కాలేజ్.

జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ .

రెండూ మన కాకినాడకి  వరమే.

ఈ సముదాయలన్ని  రాజు గారి వరం.


పిండాల చె రువు తెలుసు కుళాయి చెరువు తెలుసు.

కులం  పేరు తో చెరువు  భోగం దాని చెరువు.

అదే బోట్ క్లబ్ గా  పేరు మార్పు.

రంగుల బోట్లో జల విహారం.

సాయంత్రం వేళల్లో వాకింగ్.

నోట్లో ముర్రి మిక్చర్

 పేవ్ మెంట్ మీద అందాల విగ్రహాలు.

 ఏమి చెప్పుదు కాకినాడ వాసుల అదృష్టం.




- స్వస్తీ...




.