నిన్న ఏమి తీసుకురాకుండానే వచ్చామునేడిక్కడ చాలానే సంపాదిస్తున్నాంరేపు ఏమి తీసుకుపోకుండానే వెళ్తాము
అసలు లెక్కంతా తప్పే
మనమిక్కడ ఉన్నందుకు
ఎంతో కొంత కిరాయి ఇవ్వాలి
కాని మనం కూడబెడుతున్నాం
తీసుకురానప్పుడు
తీసుకుపోనప్పుడు
ఎందుకీ అనవసరపు అత్యాశలు... ద్వేషాలు...
ఈ ప్రపంచానికి నువు కొంత భారంగా
కొన్నేళ్ళు బతికి నప్పుడు
ఏమిచ్చావు ఈ ప్రపంచానికి నువ్వు
ఏం చెల్లించావు ఈ లోకానికి రుసుము
నా వరకైతే పనికొచ్చే నాలుగు మాటలు చెప్పేస్తున్నానుఇవి నా పొట్ట నింపవని నాకు తెలుసుకాకపోతే కొన్ని మనసుల్లో సంతోషాన్ని నింపేస్తాయికొన్ని గుండెల బరువును ఖాళీ చేస్తాయి
నువు కూడా ఏదో ఒకటి చెయ్...
నాకు తెలుసు నువు చేస్తావని...
నీకు అడ్డు పడే స్వార్థాన్ని
కొంచెం కొంచెం జరుపు
ఈ ప్రపంచం నిన్ను చాల చాల దగ్గర చేసుకుంటుంది
- స్వస్తీ...
.