జీతం ఇస్తున్నామనే నెపంతో కార్మికులను కట్టు బానిసలు గా చేసి పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణహించమని షికాగో నగరంలో కార్మికులంతా సమ్మెచేసి ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి, శ్రమ జీవుల బ్రతుకుల్లో వెలుగు నింపిన మే 1 ని కార్మిక దినోత్సవం గా జరుపుకుంటున్నాము.


కానీ ఈనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో తప్ప ప్రైవేట్ సంస్థలలో కార్మికుల చేత పశువుల్లా వెట్టి చాకిరి చేయిస్తున్నారు.



దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా  చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. 


ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక,  సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. 


కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు.  


ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.




- స్వస్తీ...


.