గౌరి ఇంట ఆకు ( గోరింటాకు )
ఆషాఢ మాసం తప్పక గోరింటాకు ధరించాలని పెద్దలు చెబుతారు.
పాతకాలంలో స్త్రీపురుష భేదం లేకుండా ఇంటిలో అందరూ గోరింటాకు పెట్టుకునే వారు.
ఇప్పటికీ సంప్రదాయం ఎఱిగిన కుటుంబాల లో స్త్రీలు గోరింటాకు కాళ్ళకి, చేతులకి నిత్యం ధరిస్తుంటారు
ప్రస్తుతం గోరింటాకు కేవలం పెళ్లిచేసుకునే వధూవరులకు పరిమితమైనది.
శాస్త్రములు మఱియు పురాణ జ్ఞానం కలిగినవారు, మంత్ర అనుష్ఠానం చేసుకునే వారు, సద్గురువులు, ఉపాసకులు కూడా గోరింటాకు ధరిస్తారు.
గోరింటాకు - ప్రయోజనములు
◆ గ్రీష్మ ఋతువు వెళ్లిన తరువాత వర్ష ఋతువు వస్తుంది. వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల కొన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి. అటువంటివి దరిచేరకుండా చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఒళ్ళు చలువ చేస్తుంది.
◆ శరీరం లో వేడి తగ్గించి రోగ నిరోధక శక్తి ఇస్తుంది. గోరింటాకు తో గోళ్ళకి, వేళ్ళకి ఆరోగ్యం. అందోళన తగ్గించి మనసు ఆహ్లాదంగా ఉంచుతుంది.
◆ గోరింటాకు మంగళ ద్రవ్యంగా ఉపయోగించబడే వస్తువు. అమ్మవారు, విష్ణువు, శివుడు మరియు ఇతర దేవతలు కూడా ఎల్లప్పుడూ ధరిస్తారు.
◆ రక్త పోటు, ప్రసరణ కూడా నియంత్రించ గలదు.
శాస్త్రము, పురాణ జ్ఞానం, మంత్ర ఉపాసన చేసేవారు గోరింటాకు ధరించడం వల్ల త్వరగా సిద్ధి పొందగలరు.
◆ గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సౌభాగ్యానికి ప్రతీక మరియు మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందుతారని శాస్త్రము.
◆చర్మరోగాలు రాకుండా గోరింటాకు కాపాడుతుంది.
◆ గోళ్ళకి "గోరుచుట్టు" రాకుండా గోరింటాకు నిరోధిస్తుంది. ఆడవాళ్ళకి సౌభాగ్యం
చిరకాలం నిలుస్తుందని నమ్మకం.
కన్యలైతే మంచి భర్తదొరుకుతాడని, మగవారు పెట్టుకుంటే మంచి భార్య దొరుకుతుందని నమ్మకం.
◆ గోరింటాకు ధరించి అంగన్యాస, కరన్యాసము లేదా దేవతోపాసన చేసినట్లయితే భగవంతుడు త్వరగా సంతుష్టుడవుతాడని, త్వరగా కోరికలు తీరుస్తాడని నమ్మకం.
అంతేగాక స్త్రీలు గోరింటాకు చేతులకు, కాళ్ళకు ధరించి ఉండటం వలన ఆధ్యాత్మిక ప్రవృత్తి త్వరగా కలిగి మనస్సు అంతర్ముఖమై ఆ దేవతతో ఐక్యమౌతుంది, త్వరగా మంత్రానుష్ఠానం సిద్ధిస్తుంది.
◆ అందుకే వివాహ సమయంలో దంపతులను సాక్షాత్ శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీ దేవితో పోల్చి తప్పక గోరింటాకు ధరించేట్లు చేస్తారు.
శుభం భూయాత్...
.