వసుదేవసుతం(న్) దేవం(ఙ్),

కంసచాణూరమర్దనం 

దేవకీపరమానన్దం(ఙ్), 

కృష్ణం(వ్ఁ) వన్దే జగద్గురుమ్









ఓం  శ్రీ పరమాత్మనే నమః

శ్రీమద్భగవద్గీతా

అథ ద్వాదశో౽ధ్యాయః


అర్జున ఉవాచ

ఏవం(మ్) సతతయుక్తా యే,

భక్తాస్త్వాం(మ్) పర్యుపాసతే৷

యేచాప్యక్షరమవ్యక్తం(న్),

            తేషాం(ఙ్)కే యోగవిత్తమాః     ৷৷1॥










శ్రీ భగవానువాచ

మయ్యావేశ్య మనో యే మాం(న్), 

నిత్యయుక్తా ఉపాసతే꠰

శ్రద్ధయా పరయోపేతాః(స్), 

               తే మే యుక్తతమా మతాః       ৷৷ 2 ॥










యే త్వక్షరమనిర్దేశ్యమ్,

అవ్యక్తం(మ్) పర్యుపాసతే꠰

సర్వత్రగమచిన్త్యం(ఞ్)చ, 

            కూటస్థమచలం(న్) ధ్రువమ్    ꠱ 3 ॥










సన్నియమ్యేన్ద్రియగ్రామం(మ్) , 

సర్వత్ర సమబుద్ధయః꠰

తే ప్రాప్నువన్తి మామేవ, 

                   సర్వభూతహితే రతాః           ꠱ 4 ॥










క్లేశో౽ధికతరస్తేషామ్,

అవ్యక్తాసక్తచేతసామ్꠰

అవ్యక్తా హి గతిర్దుఃఖం(న్), 

                     దేహవద్భిరవాప్యతే             ꠱ 5 ||










యే తు సర్వాణి కర్మాణి,

మయి సన్న్యస్య మత్పరాః꠰

అనన్యేనైవ యోగేన, 

                మాం(న్) ధ్యాయన్త ఉపాసతే      ꠱ 6 ॥










తేషామహం(మ్) సముద్ధర్తా,

 మృత్యుసంసారసాగరాత్꠰

భవామి నచిరాత్పార్థ, 

              మయ్యావేశితచేతసామ్       ꠱ 7 ||










మయ్యేవ మన ఆధత్స్వ , 

మయి బుద్ధిం(న్) నివేశయ꠰

నివసిష్యసి మయ్యేవ, 

            అత ఊర్ధ్వం(న్) న సంశయః     ꠱ 8 ॥










అథ చిత్తం(మ్) సమాధాతుం(న్),

న శక్నోషి మయి స్థిరమ్।

అభ్యాసయోగేన తతో, 

             మామిచ్ఛాప్తుం(న్) ధనఞ్జయ     ॥ 9 ॥










అభ్యాసే౽ప్యసమర్థో౽సి, 

మత్కర్మపరమో భవ꠰

మదర్థమపి కర్మాణి,

                కుర్వన్సిద్ధిమవాప్స్యసి    ৷৷ 10 ॥










అథైతదప్యశక్తో౽సి , 

కర్తుం(మ్) మద్యోగమాశ్రితః।

సర్వకర్మఫలత్యాగం(న్) , 

        తతః(ఖ్)కురు యతాత్మవాన్న  ॥ 11 ॥










శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్, 

జ్ఞానాద్ధ్యానం(వ్ఁ) విశిష్యతే।

ధ్యానాత్కర్మఫలత్యాగః(స్) ,

           త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్   ৷৷ 12 ॥










అద్వేష్టా సర్వభూతానాం(మ్) , 

మైత్రః(ఖ్)కరుణ ఏవ చ।

నిర్మమో నిరహఙ్కారః(స్), 

                 సమదుఃఖసుఖః క్షమీ      ৷৷ 13 ॥









సన్తుష్టః( స్) సతతం(య్ఁ) యోగీ, 

యతాత్మా దృఢనిశ్చయః|

మయ్యర్పితమనోబుద్ధిః(ర్) ,

                    యో మద్భక్తః(స్) స మే ప్రియః        ৷৷ 14 ॥










యస్మాన్నోద్విజతే లోకో, 

లోకాన్నోద్విజతే చ యః|

హర్షామర్షభయోద్వేగైః(ర్),

              ముక్తో యః(స్) స చ మే ప్రియః  ৷৷ 15 ॥










అనపేక్షః(శ్)శుచిర్దక్ష ,

ఉదాసీనో గతవ్యథః|

సర్వారమ్భపరిత్యాగీ ,

           యో మద్భక్తః(స్) స మే ప్రియః  ৷৷ 16 ॥










యో న హృష్యతి న ద్వేష్టి,

న శోచతి న కాఙ్క్షతి।

శుభాశుభపరిత్యాగీ,

          భక్తిమాన్యః(స్) స మే ప్రియః   ॥ 17 ॥










సమః(శ్)శత్రౌ చ మిత్రే చ,

తథా మానాపమానయోః।

శీతోష్ణసుఖదుఃఖేషు, 

                  సమః(స్) సఙ్గవివర్జితః     ॥ 18 ॥










తుల్యనిన్దాస్తుతిర్మౌనీ , 

సన్తుష్టో యేనకేనచిత్।

అనికేతః(స్) స్థిరమతిః(ర్) , 

                  భక్తిమాన్మే ప్రియో నరః     ॥ 19 ॥










యే తు ధర్మ్యామృతమిదం(య్ఁ), 

యథోక్తం(మ్) పర్యుపాసతే।

శ్రద్దధానా మత్పరమా,

          భక్తాస్తే౽తీవ మే ప్రియాః  ৷৷ 20 ॥









ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు 

ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ)

యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే 

భక్తియోగో నామ ద్వాదశో౽ధ్యాయః

||శ్రీకృష్ణార్పణమస్తు||











ముగింపు ప్రార్ధన

యోగేశం(మ్) సచ్చిదానన్దం(వ్ఁ), 

వాసుదేవం(మ్) వ్రజప్రియమ్ |

ధర్మసంస్థాపకం(వ్ఁ)  వీరం(ఙ్),  

కృష్ణం(వ్ఁ)   వన్దే   జగద్గురుమ్ ||






శ్రీమద్భగవద్గీత 12 వ అధ్యాయం - భక్తి యోగం
 నందలి మొత్తం శ్లోకముల యొక్క శ్రవణము



ఈ అధ్యాయము, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా, ప్రేమ యుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది. 

 యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది 

 భగవంతుని సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మాంను ఉపాసించే వారా అని. 

 ఈ రెండు మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీ కృష్ణుడు సమాధానమిస్తాడు. 

 కానీ, తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు. 

 నిరాకార, అవ్యక్త భగవత్ తత్త్వముపై ధ్యానం చేయటం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ద జీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు.

 తమ అంతఃకరణ ఆయనతో ఏకమై పోయినవారు, మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు, త్వరితగతిన జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు. 

 శ్రీ కృష్ణుడు ఈ విధంగా అర్జునుడిని, అతని బుధ్ధిని తనకు అర్పించి, మనస్సుని అనన్య ప్రేమయుక్త భక్తితో తన యందే లగ్నం చేయమని ప్రార్థిస్తాడు. 

 కానీ, తరచుగా, ఇటువంటి ప్రేమ, ప్రయాసపడే జీవాత్మలో కనిపించదు.

 కాబట్టి, శ్రీకృష్ణుడు ఇతర పద్దతులను కూడా సూచించాడు, 

ఒకవేళ అర్జునుడు తక్షణమే భగవంతుని యందు మనస్సుని పూర్తిగా నిమగ్నం చేసే స్థాయిని చేరుకోకలేకపోతే, అతను ఆ యొక్క దోషరహిత పరిపూర్ణ స్థాయిని చేరుకోవటానికి పరిశ్రమించాలి. 

 భక్తి అనేది ఏదో ఒక నిగూఢమైన బహుమానం కాదు, దానిని నిరంతర అభ్యాసము ద్వారా పెంపొందించుకోవచ్చు. 

 ఒకవేళ అర్జునుడు ఇది కూడా చేయలేకపోతే, అతను ఓటమిని ఒప్పుకోకూడదు; 

సరికదా భక్తితో శ్రీకృష్ణుడి ప్రీతికోసం పనిచేయటం నేర్చుకోవాలి. 

ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే, అతను తన కర్మ-ఫలములను త్యజింఛాలి 

మరియు ఆత్మయందే స్థితమై ఉండాలి.
 కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే, యాంత్రికమైన అభ్యాసం కన్నా జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఉన్నతమైనది, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కంటే ధ్యానం ఉన్నతమైనది; 

ధ్యానం కంటే ఉన్నతమైనది కర్మ ఫలములను త్యజించటం, ఇది తక్షణమే ఎంతో శాంతిని కలుగ చేస్తుంది. 


 ఈ అధ్యాయం యొక్క మిగతా శ్లోకాలు భగవంతునికి చాలా ప్రియమైన, ఆయన ప్రేమయుక్త భక్తుల యొక్క మహోన్నతమైన గుణములను విశదీకరిస్తాయి. 



 - స్వస్తీ...