ఆత్మీయ బంధువా !

అరటిచెట్టు ఔషధగుణాల గురించి ఎప్పుడైనా విన్నారా ? 

దాదాపుగా అందరికి అరటిపండు తినడం తెలుసుగానీ, 

మిగిలిన అరటి చెట్టు లోని 

ఏ ఏ అంగాలు 

ఏ ఏ వ్యాధులకు అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయో తెలియదు. 

పూర్వకాలంలో పచ్చి అరటికాయలతో పాటు 

అరటిపువ్వు, 

రటిమొవ్వ, 

అరటిదుంప, 

అరటిఊచ 

వీటిని కూడా వివిధ రకాల కూరలుగా వండుకొని తింటూ అనేక రోగాలను అరికట్టే అద్భుత సంప్రదాయం మనకుండేది. 

ఈ కాలపు ఆధునికులకు వీధుల్లో హోటళ్లలో దొరికే అనారోగ్యకర పదార్థాల గురించే తెలుసుగానీ,

పరిసరాలలోని ఆహార ఔషధాలగురించి ఏమాత్రం తెలియదు. 

అందుకే ఈ కథనాన్ని మీ కోసం ప్రకటిస్తున్నాం. 

మీరు చదవండి. 

అందరిచేత చదివించి ఆచరింపచేయండి. . .
సంస్కృతంలో కదళీ అని, 

హిందీలో ఖేలా అని, 

తెలుగులో అరటి అని, 

లాటిన్లో Mysasapientum ఆంగ్లంలో బననా అంటారు.

అరటి శాస్త్రీయ నామం మూసా ఆక్యునిమిటా. .  .


అరటిచెట్టు రూప గుణ ప్రభావాలు :

అరటిచెట్లలో అనేకరకాల జాతులున్నాయి. 

నిత్యజీవితంలో రోజూ వాడుకునే జాతి చెట్ల గురించే చెప్పుకుందాం. . .

అరటి చెట్టురసం తీపి, వగరు, రుచులు కలిగి వుంటుంది.

చలువచేస్తుంది.

వాతాన్ని పెంచి వీర్యపుష్టిచేస్తుంది.

మూత్రపిండాలలో రాళ్ళను, 

ఉదరంలోని క్రిములను, 

సెగ రోగములను, 

రక్తపైత్యాన్ని పోగొడుతుంది.


ఇంటిలో అరటిచెట్టు పెంచవచ్చా ?

ఇండ్లలో ఒకచెట్టు పెంచడం ఉత్తమమని 

రెండు చెట్లు పెంచడం మధ్యమమని, 

మూడుచెట్లు పెంచడం వ్యాధికారకమని, 

నాలుగుచెట్లు పెంచడం నాశన కరమని పెద్దలమాట. 

కాబట్టి ఒక చెట్టునే ఇంట్లో పెంచుకోండి. . .


అరటి పూవు వడియాలు

ఇవి రుచికరంగా వుండి 

దగ్గు, ఆయాసం మొదలైన 

శ్వాసరోగాలను పోగొట్టి బలం కలిగిస్తాయి. .  .


అరటి ఆకు - భోజనం

మనసుకు ఇంపుగా వుంటుంది.

జ్వరం, క్షయ, కఫవాతం, దగ్గు, ఉబ్బసం, మొదలైన వ్యాధులను అణచివేచి 

జఠరాగ్నిని వీర్యబలాన్ని ఆయువును పెంచుతుంది. . . 

అలాగే పార్కిన్సన్స్ వాళ్ళకి ఉపశమనం కలుగిస్తోంది . . . మరియు విష ప్రభావాన్ని హరించివేస్తుంది. . .


స్త్రీల - అతి ఋతురక్త స్రావానికి

బాగా మగ్గిన అరటిపండు ఒకటి 

నాటు ఆవు నెయ్యి లేదా నాటు గేదె నెయ్యి 50 గ్రా॥ కలిపి తినాలి.

ఇలా రోజుకు మూడుపూటలా మూడుసార్లు తింటూ వుంటే బహిష్టులో ఆగకుండా ప్రవాహంలాగా స్రవించే 

అతి ఋతువు ఆగిపోతుంది.


స్త్రీ ప్రాణాలు హరించే - సోమ రోగానికి

స్త్రీలలో గర్భాశయ రోగాలు ముదిరిపోయి 

చివరికి సోమరోగంగా మారి 

యోనిగుండా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూవుంటుంది. 

దీనిని వెంటనే ఆపక పోతే 

ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం.


పచ్చిఉసిరిక కాయల రసంలోగానీ, 

ఉసిరిక కాయ లతో కాచిన కషాయంలోగానీ, 

అరటిపండ్లను కలిపి కొంచెం తేనె, పటిక బెల్లం కూడా చేర్చి 

రెండుపూటలా సేవిస్తూ వుంటే 

స్త్రీల సోమరోగం హరించిపోతుంది . . .


కాలినగాయాలకు కమ్మని లేపనం

బాగా పండిన అరటిపండును మెత్తగా పిసికి 

కాలిన గాయాల పైన వెంటనే లేపనం చేస్తే 

మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతాయి. .  .


మూత్రంలో మంట - తగ్గుటకు 

బాగా మెత్తగా వున్న పసుపు పచ్చని చిన్న అరటి పండు తింటూ వుంటే 

మూత్రంలో మంట తగ్గడమే కాక

ఆమాశయం కూడా పరిశుభ్రమౌతుంది. . .

తెల్లబొల్లి మచ్చలు - తగ్గుటకు

అరటి చెట్టు దూట రసం తీసి 

తగినంత పసుపు కలిపి 

పైన లేపనం చేస్తూ వుంటే 

తెల్లబొల్లి త్వరగా నివారించ బడుతుంది. . .


అతివేడి - అతిపైత్యం

అరటిచెట్టు వేరును మెత్తగా నూరి రసం తీసి 

రెండు మూడు చెంచాల రసం 

ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ వుంటే 

తివేడి, అతిపైత్యం రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. . .


అన్నిరకాల కడుపు నొప్పులకు

అరటి చెట్టును ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి పెట్టుకోవాలి. 

ఈ బూడిదను 1 లేక 2 గ్రాముల మోతాదుగా 

ఒక కప్పు నీటిలో కలిపి 

రోజూ మూడు పూటలా తాగుతూ వుంటే 

ఉదర రోగాలు తగ్గిపోతాయి.  . .


మూత్రం ఆగితే ? - రప్పించడానికి

అరటి దుంపను మెత్తగా తొక్కి 

పొత్తి కడుపు పైన వేసి 

బట్టతో కట్టుకడితే 

మూత్రం అతిత్వరగా సహజంగా బయటకు వస్తుంది. . .


ఉబ్బరోగం తగ్గుటకు

రోజూ ఉదయం పరగడుపున ఒక చక్కెరకేళీ అరటి పండును 

తగినంత గోమూత్రంలో కలిపి మెత్తగా పిసికి 

ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే ...

అతిదారుణమైన ఉబ్బస రోగం అతిత్వరగా తగ్గిపోతుంది. . .


యోని జారే - యోనికంద రోగానికి

పచ్చి అరటికాయలను ముక్కలుగా తరిగి 

ఎండబెట్టి దంచి జల్లించి నిలువ వుంచుకోవాలి. 

వివిధ కారణాలవల్ల కొందరు స్త్రీలకు యోని బయటకు జారిపోతుంది. 

అలాంటివారు ఈ చూర్ణాన్ని పూటకు మూడు నుండి అయిదు గ్రాముల మోతాదుగా మంచి నీటితో రెండు పూటలా సేవిస్తూవుంటే యోనికంద రోగం హరించిపోతుంది.  . .


పాత దగ్గులు పారిపోవుటకు

అరటిపండును తొక్కతీసి

 ఆ పండు మధ్యలో చిటికెన వెలు పెట్టి పొడిచి 

గుంటలాగా చేసి 

ఆ గుంటలో ఒక గ్రాము మిరియాలపొడి వేసి 

ఆ పండును ఒక మోతాదుగా 

రోజూ రెండు పూటలా తింటూవుంటే 

చాలా కాలం నుంచి వేధించే దగ్గు తగ్గిపోతుంది. . .


పెద్ద పెద్ద పుండ్లు తగ్గిపోవుటకు

మెత్తటి అరటిపండ్లు,

 వేడి అన్నం, 

గేదె పేడ సమంగా కలిపి మెత్తగా పిసికి 

పైన వేసి కట్టు కడుతూవుంటే క్రమంగా 

ఆ పుండ్లు మానిపోతాయి. . .


పులిత్రేన్పులు త్వరగా తగ్గుటకు

అరటి ఆకులను బాగా ఎండబెట్టి కాల్చి జల్లించి నిలువవుంచుకోవాలి. 

ఆ బూడిదను ఒకటి లేక రెండు చిటికెలు మోతాదుగా ఒకచెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటూవుంటే త్రేన్పులు తగ్గిపోతాయి. . .


స్త్రీలు - సుఖంగా ప్రసవించుటకు

అరటి చెట్టు వేరును స్త్రీ నడుముకు కట్టివుంచితే అతి సులువుగా కష్టం లేకుండా ఆ స్త్రీ వెంటనే ప్రసవిస్తుంది. . .


ఆగిన బహిష్టు - మరలా వచ్చుటకు

అరటి ఊచరసం పరగడుపున అరకప్పు మోతా దుగా సేవిస్తుంటే ఆగిపోయిన బహిష్టు మరలా వస్తుంది. . .


శెగ రోగములు హరించుటకు

అరటి దుంప రసం 20గ్రా॥ 

పటికబెల్లం పొడి 20గ్రా|| 

కలిపి రెండు పూటలా సేవిస్తూ వుంటే 

తెల్లతెగ, ఎర్రశెగ, పచ్చతెగ తగ్గిపోతాయి. .