మన తెలుగు రాష్ట్రలలో కొండల పైన గుట్టల పైన దొరికే అపురూపమైన అనంత కోటి శక్తులు కలిగిన ఈ అక్కలకఱ్ఱ మొక్క దాదాపుగా అందరికి తెలియదనే చెప్పవచ్చు. 

ఇది బంగారంలాగా ఎంతో విలువైన మొక్క . . .

దీని వేర్లకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన గిరాకీ వుంది. . .

వెంపలి చెట్టు లాగా పెరిగే ఈ మొక్కలు మన రాష్ట్రంలో అనేకచోట్ల కొండగుట్టల పైన, మెట్టప్రాంతాలలో కనిపిస్తూ ఉన్నాయి . . . 

దీని సర్వాంగాలు సర్వోన్నతమైన శక్తికలిగినవే . . .

మన భారత దాత్రి తనశక్తినంతా ధారపోసి సృష్టించిన 

ఈ అక్కలకఱ్ఱ గురించి కొన్ని వివరాలైనా 

ప్రతి సంజీవని ఔషధ వన పాఠకులు తెలుసుకోవాలి . . .

అందుకే ఈ మొక్క గురించి తెలియజేస్తున్నాం . . .






అక్కలకఱ్ఱ పేర్లు 

సంస్కృతంలో అకారకరభ అని ,

హిందీలో అకర్ కరా అని ,

తెలుగులో అక్కలకఱ్ఱ అని ,

దీని శాస్త్రీయ నామం Anacylus Pyrethrum . . .

Pyrethrum Radise 

ఆంగ్లంలో Pellitory root అని అంటారు . . .




 అక్కలకఱ్ఱ రూప గుణ ధర్మాలు

అక్కలకఱ్ఱ వేరు కారంగా వుండి 

నాలుకపై కొద్దిగా వేసుకుంటే చిమచిమలాడుతుంది . . . 

ఉష్ణ స్వభావంతో వాత, పిత్త, కఫ సంబంధమైన సమస్త దోషాలను హరించివేస్తుంది . . . 

నరాలకు బలం కలిగించి గుండె జబ్బులను, 

పక్షవాతాన్ని 

తల నొప్పిని, 

మూర్ఛను 

హరించివేసి బుద్ధికి కూడా బలమిస్తుంది. 

సమస్త వాత, మేహనొప్పులను పోగొడుతుంది . . . 

శరీరంలోని చెడుపదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది . . . 

దీని ఉపయోగాలు కోకొల్లలుగా ఉన్నాయి . . . 

వాటిలో కొన్ని చెప్పుకుందాం . . .



బాల పాప చిన్నెలు - హరించుటకు

అక్కలకర్ర వేరును దారంతో చుట్టి 

పిల్లల మెడలో వేస్తే పిల్లలకు చంటి బిడ్డ గుణాలు, 

బాల పాప చిన్నెలు మొదలైనవి అంటుకోవు . . .



అనేకనొప్పులకు - అక్కలకఱ్ఱ

అక్కలకఱ్ఱ వేరును దంచి పొడిచేసుకొని 

నిలువ వుంచుకోవాలి . . .

రెండు మూడు చిటికెలు మోతాదుగా 

ఒక చెంచా తేనె తో కలిపి 

కొద్ది కొద్దిగా నిదానముగా చప్పరించి తింటుంటే

వెన్నునొప్పి , 

పిరుదులనొప్పి , 

పాదాలనొప్పులు , 

మోకాలు నొప్పులు , 

నడుము నొప్పులు తగ్గిపోతాయి . . .




నత్తి తగ్గుటకు - అక్కలకఱ్ఱ

రోజూ అక్కలకఱ్ఱ వేరు ముక్కను కొద్దిగా గంధం తీసి 

నాలుకపైన కొద్దిగా మాత్రమే రాస్తుంటే 

నత్తి తగ్గిపోతుంది . . .

ఎక్కువరాస్తే పుండు పడుతుంది జాగ్రత్త . . .




కంఠ రోగాలు - దంత రోగాలు

అక్కలకఱ్ఱ, 

దుంపరాష్ట్రం, 

సొంఠి 

ఒక్కొక్కటి ఒక్క గ్రాము చొప్పున

 ఒక గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు 

చిన్న మంటపైన మరిగించి 

దించి వడపోసి 

గోరువెచ్చగా నోటిలో పోసుకొని 

గొంతు వరకు తగిలేటట్లు 

అయిదు నిమిషాల పాటు పుక్కిలించి ఊసి వేస్తుంటే 


కంఠ రోగాలు, 

దంత రోగాలు 

మాటుమాయమై పోతాయి . . .



జగ మొండి - శిరో రోగములకు

అక్కలకర్ర, 

మిరియాలు, 

సొంటి 

ఒక్కొక్కటి 5 గ్రాముల మోతాదుగా తీసుకొని 

మంచినీటితో మెత్తగా నూరి తలకు పట్టు వేస్తుంటే 

దీర్ఘకాలికమైన తలనొప్పులు తగ్గిపోతాయి . . .



గర్భం రాకుండా రక్షణ మార్గం

మిరియాలు, 

అక్కలకర్ర 

సమంగా పొడిచేసి నిలువ వుంచుకోవాలి . . .

సంభోగం చేసే ముందు కొద్దిగా పొడిని తేనెతో మెత్తగానూరి పురుషుడు తన అంగానికి లేపనం చేసుకొని 

ఆ తరువాత సంభోగంలో పాల్గొంటే ఆస్త్రీకి గర్భంరాదు . . .



మూతి వంకర పోయే  - ముఖ పక్షవాతం

అక్కలకర్ర, 

నేలతాడి దుంపలు,

బూరుగు వేర్లు, 

లవంగాలు,

దాల్చినచెక్క 

చలువ మిరియాలు, 

పిప్పళ్ళు, 

అశ్వగంధ గడ్డలు, 

జాజికాయలు, 

బాదం పప్పు, 

పిస్తాపప్పు, 

గసగసాలు,

జాపత్రి, 

నల్ల జీలకర్ర 

వీటిని ఒక్కొక్కటి పదిగ్రాముల మోతాదుగా తీసుకొని 

తగినంత తేనెతో కలిపి మెత్తగా ముద్దలాగా నూరాలి . . .

ఆ ముద్దను రేగి పండంత గోలీలుగా చేసి ఆరబెట్టి నిలువవుంచుకోవాలి . . .

రోజూ పూటకు ఒకమాత్ర చొప్పున

రెండు పూటలా తేనెకలిపిన నీటితో సేవిస్తువుండాలి. 

ఇలా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే మూతి వంకర తగ్గి ముఖం సక్రమంగా వస్తుంది . . .



బాలెంతల వాత రోగములకు

అక్కలకర్ర 

మిరియాలు 

గ్రామాల్లో దొరికే తెల్ల ఉప్పి చెట్టు చిగుర్లు 

సమంగా తీసుకొని మంచి నీటితో మెత్తగానూరి 

శనగ గింజలంత గోలీలు చేసి నీడలో గాలికి బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి . . .

రోజూ పూటకు రెండు గోలీలు చొప్పున 

రెండు పూటలా మంచి నీటితో వేసుకొంటూవుంటే 

సూతికా వాతం హరించిపోతుంది . . .


పథ్యం : వేయించిన ఉప్పు, కాల్చిన మిరిప కాయలు పొంగునీళ్ళ అన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవాలి . . .




దగ్గు, రొమ్ము, పడిశం

అక్కలకర్ర వేర్లను దంచి జల్లించి నిలువ వుంచుకోవాలి.

ఒకటి లేదా రెండు చిటికెల పొడిని ఒక చెంచా తేనెతో కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే 

కఠినమైన దగ్గులు, గడ్డ కట్టుకుపోయిన రొమ్ము పడిశం హరించి పోతాయి . . .



ఫిట్స్, మూర్ఛలు హరించుటకు

అక్కలకర్ర వేర్ల పొడిని 

వెనిగర్ మెత్తగా నూరి 

దానికి మూడురెట్లు తేనె కలిపి 

ఆ మిశ్రమాన్ని గాజు సీసాలోనిలువ పెట్టుకోవాలి . . . 

రోజు పరగడుపున మూడు గ్రాముల మోతాదుగా చప్పరించి తింటుంటే 

పిట్స్, మూర్ఛలు తగ్గిపోతాయి   . . .



పక్షవాతానికి - పసందైన మార్గం

అక్కలకర్ర వేర్ల పొడి, 

దోరగా వేయించిన సొంఠిపొడి,

దోరగా వేయించిన నలజీలకర పొడి, 

దోరగా వేయించిన సన్నరాష్ట్రం పొడి 

సమంగా కలిపి నిలువవుంచుకోవాలి . . . 

రోజూ రెండుపూటలా రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా ఈ పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే . . 

క్రమంగా పక్షవాతం తగ్గిపోతుంది . . .



చిలుకచేత - మాట్లాడించుటకు

అక్కలకర్రను దంచి పొడిచేసి

ఆహార పదార్థా 'లలో కొద్ది కొద్దిగా కలిపి రోజు తినిపిస్తుంటే 

చిలుకకు మాటలు వచ్చి మనిషి లాగా మాట్లాడగలుగుతుంది . . .

పూర్వం ఈ ప్రయోగం ద్వారానే మైనా పక్షులకు చిలుకలకు మాటలు నేర్పేవారు . .  . 






శుభం భూయాత్


స్వస్తీ . . .