🛕



🚩


దేహం మనసుతో చెప్తున్నా మాట నీ కోసం నన్ను తీసుకెళ్ళు దేవాలయానికి 🛕 అని . . .


మనసు కోరుకుంటేనే కదా ఎక్కడికైనా దేహమనే వాహనాన్ని తీసుకొని ప్రయాణం సాగిస్తుంది . . .


దేహానికి  రోజుకి మూడు పూటలు అన్నం పెట్టి శక్తిని ఇస్తున్నాము . . .


కానీ మనసుకి  మనోబలం మానసిక శక్తి యుక్తులు పొందాలంటే


మీ దగ్గరలో ఉన్న ఆలయం 🛕 లో . . .


శిలా శిల్పంగా మారి దైవంగా మారే ప్రక్రియ లో భాగంగా . . .


జప, తర్పణ, హోమ  పంచ్యాధివాస, ప్రతిష్ట ,కళన్యాసములను ప్రతిష్టాకల్పాన్ని దివ్య వేద మంత్ర ఉచ్చరణతో 


ఈ ప్రక్రియలు అన్ని చేసి సర్వాంతర్యామి అయిన దైవ శక్తిని ఆలయం🛕 లో ప్రకటితమయ్యేలా చేసి 


తద్వారా ఆలయానికి 🛕 విశ్వాసంతో వచ్చిన వారికి ఆ దివ్య శక్తిని పొందే అవకాశాన్ని కల్పించడమే . . .  

దేవాలయ వ్యవస్థ . . .


ఆలయం చిన్నదైనా పెద్దదైనా శక్తి తరంగాలు ఒక్కలానే ఉంటాయి . . .


అక్కడికి వెళ్లి కొద్దిసేపు అయినా సమయం గడిపితే 

మీ ప్రమేయం లేకుండానే మనసు శక్తివంతం అవుతుంది . . .


ఒక 41 రోజులు విడిచిపెట్టకుండా విశ్వాసంతో ఆలయానికి వెళ్లి చూడండి  . . . 


స్పష్టమైన మార్పు కనిపిస్తుంది . . .


మనసులో . . . జీవితం లో . . . కూడా  అక్కడ ఉన్న దైవానికి మీకు ఏర్పడిన దైవిక సంబంధం వల్ల విడిచిపెట్టకుండా ఆలయానికి 🛕వెళుతూనే ఉంటారు . . .


ఎందుకంటే దైవాన్ని మీరు చూడలేక పోయినా ప్రతిరోజు వచ్చే నిన్ను దైవం చూస్తుంది కదా 

విశ్వాసం నిన్ను దైవ శక్తి కి దగ్గర చేస్తుంది . . .

శక్తి తరంగాలు మీపై ప్రసరింపచేస్తుంది . . .  సందేహమే లేదు . . .


మన సంస్కృతి సంప్రదాయాల్ని ముందు తరాలకు ఇవ్వాలంటే మన పిల్లలతో పాటు చేసే ఆలయ దర్శనం తోనే ఇవ్వగలము . . .


దర్శనం పాప నాశనం పుణ్య సముపార్జన హేతువు


హిందూ ధర్మం వికసించాలన్నా . . .

మన ముందు తరాలు హిందువుగా జీవించాలన్నా . . .

మన అందరి కర్తవ్యం దేవాలయ దర్శనం 

కనుక విధిగా అవకాశం చేసుకుని . . . 


మీ దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శనం చేసుకుంటారనీ ఆశిస్తున్నాను . . .


శుభం భూయాత్ . . . 🪷


లోకా సమస్తా సుఖినోభవంతు 

🚩