భారత దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు వాటి నిర్వహణ వ్యవస్థ ఈనాడు సృష్టించింది కాదు. 

వేదకాలం లో నుండి వేదాలలో వివరించినట్టు గా దేవాలయ నిర్వహణ వ్యవస్థ ను నాటి నుండి నేటివరకు ఒకే పద్ధతిలో ఉండేది. 

ఆనాటి పరిస్థితి  లో ధనిక. . . పేద వ్యత్యాసం ని నివారించేందుకు నాటి ప్రజలందరికీ పోస్టిక ఆహారము దక్కాలి అనే సత్ సంకల్పం తో, 

వసుదైక కుటుంబంకం పైనే నారాయణ సేవ పేరున అన్న వితరణ. . .

ప్రసాద వితరణ నిరంతరం ప్రతి దినం, 

సంవత్సరం పొడుగునా 

ఏదో ఒక పర్వదినం అనో,

పండుగ అనో, 

హోమాలు అనో, 

వ్రతాలు అనో ,

దేవాలయము ద్వారానో, 

ధార్మిక సంస్థలు ద్వారానో . .  .

కేవలం అంటే కేవలం హిందూ సంస్థలలో మాత్రమే . . .

పేద ధనిక తారతమ్యం లేకుండా ఆహారాన్ని అందించారు. . . .

భక్తుల సమర్పణ మీదే ఆధారపడి ఈ పుణ్య కార్యక్రమము స్వామివారికి నైేద్యంగా జరిగేది. . . 

నైవేద్య సమర్పణ తరువాత ప్రజలందరికీ అందించే సంప్రదాయము

 ఒక్క సనాతన ధర్మం మాత్రమే నిర్వహిస్తుంది. 

స్వామీ కి సమర్పించే ప్రసాదాలు ఏనో రకాలైన పోషకాలు సమ్మిళ్లితం

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది. 

ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.


ఉదాహణకు :

" జీర్ణశక్తిని పెంచే " కట్టె పొంగళి :

బియ్యం, పెసర పప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి, అల్లం, శొంఠిపొడి, ఉప్పు, కరివేపాకు, జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే 

కట్టెపొంగలి రోగనిరోధక శక్తిని, 

జీర్ణశక్తిని పెంచు తుంది. 

మంచి ఆకలిని కలిగిస్తుంది.


" జీర్ణకోశ వ్యాధుల నివారిణి " పులిహోర :

బియ్యం, చింతపండు పులుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉప్పు, ఇంగువ, పసుపు, బెల్లం, నూనె, వేరుశనగలు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే 

పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది. 

జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది.


" మేధస్సును పెంచే  దద్ధోజనం " :

బియ్యం, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, అల్లం-మిర్చి, కొంఠి పొడిల మిశ్రమంతో తయారుచేసే 

ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది. 

శరీరానికి మంచి శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని కల్గిస్తుంది.


" వార్ధక్యాన్ని నిలువరించే " కదంబ :

బియ్యం, చింతపండు, ఎండుమిర్చి పోపులు, ఇంగువ, నూనె, ఉప్పు, కందిపప్పు, పసుపు, బెల్లం, నెయ్యి, బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుళ్లు, బీన్స్, దోసకాయ, క్యారెట్, టమోటా, చిలకడదుంపల మిశ్రమంలో తయారుచేసే

 కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం. 

సప్తధాతువుల పోషణ చేస్తుంది. వార్ధక్యాన్ని నిలువరిస్తుంది. 

అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం.


" శ్లేష్మాన్ని తగ్గించే" పూర్ణాలు :

*పచ్చిశనగ పప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల మిశ్ర మంతో 

ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది. 

శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. 

మంచి బలవర్ధకం.


" రోగనిరోధక శక్తిని పెంచే " చలిమిడి :

బియ్యం పిండి, బెల్లం, యాలకులు, నెయ్యి, పచ్చకర్పూరం, జీడిపప్పు, ఎండుకొబ్బరి కోరుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం .


 కొబ్బరి పాల పాయసం :

కొబ్బరి పాలు, పచ్చ కర్పూరం, యాలకుల పొడి, బాదంపప్పు, కుంకుమపువ్వు, పంచదార ఆవు పాలు, కలకండ పొడితో చేసే 

ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. 

మంచి బలవర్ధకం. 

శ్లేష్మాన్ని హరిస్తుంది.
- స్వస్తీ . . .