మన దేశంలో పల్లెటూరయినా. . . పట్నమైనా . . . ప్రతి మహిళా ఇంటి ముందు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే అందరూ విధిగా కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు . . ..
మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కూడా ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు . . .
కొందరు గీతల రూపంలో, ఇంకొందరు చుక్కలతో ముగ్గులు వేస్తారు . . .
మొత్తానికి ఆ ఇంటికి అందం తీసుకొచ్చేలా ప్రతి రోజు ఏదో ఒక కొత్త ముగ్గు వేస్తుంటారు . . .
చూసేవారికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది . . .
ముగ్గులు ఫలానా కాలం నుంచి వేస్తున్నారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా,
పూర్వకాలం నుంచి ముగ్గులు వేస్తున్నారని చెప్పవచ్చు . . . .
ఎందుకంటే అన్ని పురాణాలలో కూడా ఈ రంగవల్లి ప్రస్తావన ఉంది కనుక పూర్వ కాలం నుంచి ఈ ఆచారం ఉండేదని తెలుస్తోంది . . .
ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.
మగవారికి మాలతో జపం చేసే సమయం ఉంటుంది, కానీ ఆడవారికి ఆ సమయం ఉండదు కనుక, జ్ఞాన ముద్ర వల్ల కలిగే పలితం చూపుడు వేలు, బ్రొటన వేలు వాడి ముగ్గువేయటం వలన ఆడవారికి కలుతుంది.
ముగ్గు వేయడానికి ఎక్కువగా రాతిసున్నము, గుల్ల సున్నము, బియ్యం పిండి లేదా రెండూ కలిపి వాడతారు.
సున్నము తో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్ళూ, జెర్లు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు.
బియ్యం పిండితో వేస్తే…
ఆ పిండి తినటానికి చీమలు చేరతాయి,
అవి ఈ విష కీటకాలను చంపుతాయి, ఫలితం ఒకటే.
అంతేకాదు ముగ్గును బట్టి ఆ ఇంటామె మనస్తత్వం చెప్పేస్తారు
ఓ రోజు వేయకపోతే . . .
ఆ సదరు మహీళ ఆరోగ్యం బాలేదని లేదా ఆమె మనసు బాలేదని/ ఏదో గొడవ జరిగిందని/ పని ఎక్కువగా ఉందని ఇరుగు పొరుగువారు తెలుసుకుని సహాయపడేవారు.
ఇంకా అనుభవం ఉన్న పెద్దలు (మహిళలు), ఓ మహిళ వేసిన ముగ్గు చూసి ఆమె స్వభావం, మానసిక స్ధితి తెలుపగలిగేవారు.
ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి . . .
ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం.
అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలని పెద్దలు సూచిస్తుంటారు . . .
దేవుడి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గువేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పనిసరిగా గీయాలి . . .
నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుంది . . .
ఇంటి ముందు వేసే పద్మం ముగ్గువెనుక యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడుశక్తిని ఆపుతుందని చెబుతారు . . .
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు.
ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానించేందుకే . . .
ఇంటి తలుపులు తెరిచి ఉన్నా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ఇంటి నుంచి బిక్ష స్వీకరించేవారు కాదట.
అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదు.
శ్రాద్ధకర్మలు చేసిన వెంటనే ఇంటిముందు ముగ్గు వేయరు.
శ్రాద్ధకర్మ పూర్తైన తర్వాత ముగ్గువేస్తారు.
అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గు వేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు.
ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది. .
ఎందుకంటే చుక్కలు, వరుసలు, పంక్తల వంటి సంఖ్యలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
దీంతో వారి మెదడుకు పని పడుతుంది. దీంతో మెదడుకు, ఉదయం లేవగానే మహిళలకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంగా ఉపయోగపడుతుంది.
ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు.
ఎందుకంటే ముగ్గు వేసేందుకు శరీరానికి శ్రమ కలిగించాల్సి ఉంటుంది.
దీంతో వెన్నెముక మెరగవుతుంది.
ముగ్గులు వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ఎందుకంటే ఇవి వేసేందుకు చాలా ఓపికగా ఉండాలి.
అంతేకాదు ఉదయాన్నే ముగ్గు వేసే సమయంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్య పరంగానూ ప్రయోజనకరంగా ఉంటుంది.
పండగలప్పుడు ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలు పేడతో చేస్తారు .
ఆడవారి చేతులు ఎక్కువ తడుస్తూ ఉండి చేతులు పగుల్లు ఉంటాయి, గోళ్లల్లో పాచి పేరుకుని ఉంటుంది..
గనుక, చేతులతో పేడను ముట్టుకుని గొబ్బెమ్మలు తయారు చేసి పెట్టిన వారికి చేతులకు ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి.
ఈ గొబ్బెమ్మలు ముగ్గుల మధ్య దారిలో పెడతారు,
అవి తొక్కిన వారి పాదాలకు ఉన్న వ్యాధులు, పగుళ్ళకు ఇవి నివారణకారిగా పనిచేస్తాయి.
మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు.
మన ఆచార సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి . . .
ఆచరించి తరించండి
- స్వస్తీ
మీ రామ్ కర్రి . . . 🖋️
జ్ఞానాన్వేషి 🧠,
ధర్మ రక్షక్ 📿,
నవ యువ కవి 📖,
రచయిత ✒️,
బ్లాగర్ 🪩 ,
టెక్ గురు 🖥️ ,
సామాజిక కార్యకర్త 🩸 ,
📚 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📜 ,
🛕 రాంకర్రి జ్ఞాన కేంద్ర 🚩,
మరియు
🍃 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🍂 ,
వ్యవస్థాపకులు