మన ఈ సంప్రదాయాలు ఊరకనే పుట్టుకు రాలేదు
పూర్వీకుల అనుభవసారం మన సాంప్రదాయాలు !
ముందు తరం వారికి ముసలి తరం వారిచ్చిన
అపూర్వ కానుకలు . . .
శుభకార్యాలలో ఇంటి గుమ్మానికి అరటి చెట్టును అందంగా అలంకరిస్తారు
చాలా మంది పచ్చదనం శుభప్రదం అందుకే ఇలా పూర్వీకులు ఇలా అలంకరించేవారు అనుకునే వారు . . .
కానీ అందులో కూడా ఓ సైన్స్ దాగొని ఉంది. . .
అరటి చెట్టు గుమ్మానికి కట్టడం వల్ల ఎలాంటి గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు . . .
ఇంతకీ మీకు అరటి ఆకులో భోజనం చేయడం అంటే ఇష్టమేనా ?
అరటి ఆకు లో ఉండే శక్తి మనకి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు అస్సలు విడిచిపెట్టారు . . . ! !
ఈ రోజుల్లో ప్లాస్టిక్ తో చేసిన గ్లాస్ లు, పేపర్ ప్లేట్స్, కవర్లు లేనిదే . . .
ఉదయం నుండి పడుకునే వరకు టీ, భోజనం మొదలు ఎలాంటి ఆహారాలను సేవించడం లేదు . . .
కేన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులకు 99% కారణం
వీటి వాడకమే తెలిసి కూడా వాటిని వదలలేకపోతున్నారు . . .
అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్న ఆచారం.
పూర్వం మన తాతల కాలంలో అరిటాకులో భోజనం చేసేవారు.
కొద్ధి మంది మాత్రమే ఇప్పటికి మన తెలుగింటి సంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు . . .
కొందరు శుభకార్యాలకు అరిటాకే వాడుతున్నారు . . .
కొన్ని హోటల్స్‌లో ఇప్పటికీ అరిటాకు భోజనమే . . .
మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.
శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి
అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు
ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది.
అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు,
మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు పై పొరలో ఉండే పాలీఫినాల్స్ భోజనంలో కలిసిపోతాయి
అరటి ఆకుల్లో ఎక్కువగా పాలీఫినాల్స్ ఉంటాయి
ఇవి యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి
దీని వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందడమే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది
ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది
దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి
భోజనంలో ఉండే విష పదార్థాలను గ్రహించి అరటి ఆకు వెంటనే నల్లగా మారుతుంది ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది
గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి . . .
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని
తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.
ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా,
పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.
వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను. ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో.....
అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో
భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్నిహరిస్తుంది. అటువంటి పనిని చేసేది
కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము.
బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో! అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది.
- స్వస్తీ . . .