హారం వండేటప్పుడు గాలి, వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . . .


మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి, గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . . .


ఎందుకంటే అది ఆహారము కాదు . . .


విషముతో సమానమని వాగ్భటాచార్యుని సూత్రము . . .









ఇందులో విశేషం ఏమిటంటే విషము రెండు రకాలుగా పనిచేస్తుంది . . .


మొదటిది తక్షణమే పనిచేస్తుంది , 


రెండవరకపు విషం నిదానంగా పనిచేస్తుంది . . .


అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు గా పనిచేస్తుంది . . .


ఇలాంటిదే గాలి, సూర్యరశ్మి తగలకుండా వండబడిన భోజనము ఉదాహరణకి ప్రెషర్కుక్కర్ . . .


ఇందులో ఆహారం వండేటప్పుడు ఏ మాత్రమూ గాలి, సూర్యరశ్మి తగిలే అవకాశమేలేదు . . .


ఇది పూర్తిగా విషతుల్యము అని ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే ఈ విధానం గురించి ఊహించి చెప్పారు వాగ్భటులు . . .


ఇప్పటి శాస్త్రవేత్తలు C.D.R.I. ( సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ) వారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు .  .  .


ప్రెషరకుక్కర్ ఇందులో మరొక ప్రమాదకర విషయం ఏమిటంటే, 


ఈ ప్రెషర్ కుక్కర్ తయారు చేసేది అల్యూమినియం తో


ఆహారం వండటానికి గానీ, నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరానిది అల్యూమినియం


ఈ పాత్రలోని ఆహారం మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి మధుమేహం, జీర్ణ సంబంధిత, టి.బి., ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి . . .


ఇంత ప్రమాదకరమైన అల్యూమినియం మనకు ఎలా వచ్చింది . . . 


ఎప్పటి నుంచి వాడకం మొదలైనది అని చూస్తే తెలిసిన ఆశ్చర్యకర విషయం ఏమిటంటే . . . !


భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు జైళ్ళలో ఖైదీలుగా ఉన్న భారతీయ విప్లవకారులను, నిర్వీర్యులుగా చేయటానికి ఆంగ్లేయులు వారి శాస్త్రజ్ఞులుచే తయారు చేయించి అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని తయారుచేసి వడ్డించేవారు . . .


ఆ కాలంలో జైళ్ళలో ఉండే భారతీయ విప్లవకారులు ఎందరో మన దేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులకి ఎదురు తిరిగిన వారే . . .


ఇప్పుడు ఆంగ్లేయులు వెళ్ళిపోయారు 


కానీ మన జైళ్ళలో ఇప్పటికీ అల్యూమినియం పాత్రలు వాడుచునే ఉన్నారు, 


మరీ ప్రమాదకర పరిస్థితి ఏమిటంటే

ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్చేసింది . . .


ఎక్కువగా పేదవారి ఇళ్ళలోకి


పాపం వారికి తెలియని ఎన్నో సమస్యలతో చాలా ఇబ్బందులకి గురవుతున్నారు . . . 


మనం గమనించవలసిన ముఖ్య విషయం వాగ్భటుని మొదటిసూత్రం గాలి, సూర్యుని వెలుతురూ తగలకుండా వండిన ఆహారం ఏదైనా విషంతో (స్లో పాయిజన్) సమానము . . .


ఇలాంటిదే మరో వస్తువు “ రిఫ్రిజరేటర్ ” దీనిలో కూడా ఏవిధంగానూ గాలి వెలుతురు ప్రవేశించవు కనుక


దీని వాడకం కూడా ఎంతో ప్రమాదకరమని గుర్తించాలి . . .


మన ఇంట్లో వాడుకునే మరొక ప్రమాదకర వస్తువు మైక్రోవోవెన్ అందులో కూడా ఏవిధమైన గాలి, వెలుతురూ ప్రవేశించవు . . . 


దీన్నిబట్టి మనం గమనించవలసినది వాగ్భటుని మొదటి సూత్రము . . . 


కానీ ఇప్పటివారందరూ అంటారు


మాకు ఈ వస్తువుల వల్ల చాలా సమయం కలిసి వస్తున్నది అని . !


అయితే మీకు మిగిలిన సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు . . . ?


అంటే, ఎక్కువమంది మహిళలు టీ.వి.లో సీరియల్స్ చూస్తున్నారు అని తెలిసింది . . .


దీనివల్ల మీకు ప్రయోజనం ఏమిటో మీకు తెలుసు . . .


ఇలా మీరు పొందిన మీ ఖాళీ సమయాన్ని ఒకసారి అనారోగ్యులై మంచాన పడితే ఎంత నష్టమో మీరే ఊహించుకోండి . . .









ఇక్కడ మరింత జాగ్రత్తగా గమనిస్తే ప్రెషర్ అనగా ఒత్తిడి 


అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది కానీ ఉడకదు


అంటే పదార్థం ఉడకడం వేరు మెత్తబడడం వేరు . 


దీని వ్యత్యాసం ఏమిటంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం


భూమిలో ఏ గింజ పండటానికి ఎంత ఎక్కువ కాలం పడుతుందో అదే విధంగా

ఆ గింజ వండటానికి  కూడా అంతేయ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది.


ఉదాహరణకి కందిపప్పు పంట పండటానికి కనీసం 7 నుండి 8 నెలలు పడుతుంది . . .


ఎందుకంటే అందులో ఉండే విటమిన్స్, ప్రొటీన్స్, మైక్రో న్యూట్రియన్స్


అన్నీ సక్రమంగా మట్టి నుండి తయారవటానికి అంత సమయం పడుతుంది . . .


మట్టిలోనే అన్నిరకాల మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి.


ఇవన్నీ మొక్క వేరులోకి చేరి క్రమంగా ఫలానికి చేరుతాయి కనుకనే అంత సమయం పడుతుంది . . .


కాబట్టి గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్థం వండబడాలి, మెత్తబడితే సరిపోదు . . .


ఇది ప్రకృతి ధర్మం . . . ఆయుర్వేద సిద్ధాంతం . . .



అంతే కానీ మనం తొందరపడితే ఏమి జరగదు . . .


 బిడ్డ జన్మించాలంటే కూడా తొమ్మిది నెలలు వేచి చూడాలి 

 . . .


అప్పుడే సంపూర్ణత్వం జరుగుతుంది . . .


పూరీ జగన్నాధ స్వామి ఆలయంలో ప్రసాదం మట్టిపాత్రలలోనే వండబడుతుంది . . . 


మరియు మట్టిపాత్రలోనే అందించబడుతుంది . . .


ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది అంతేకాక


వైజ్ఞానికంగా కూడా మన శరీరం అంతటా ఉండేది మట్టియే . . . 


శరీరం దహనం చేసినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టిమాత్రమే . . . 


అందులోనే 18 రకాల  మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి . . .


దాన్నే మనం బూడిద అంటాము .  . . 


వైజ్ఞానిక విషయం అక్కడి పూజారులకు తెలియకపోవచ్చు .  . . 


ఎందుకంటే వారు సైన్స్ చదువలేదు కాబట్టి . . .


అయినా కూడా శాస్త్రవేత్తలయిన వారు ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తెలుసుకునే విషయం


వారికి తెలియకపోయినా వారు ఆచరిస్తున్నారు . . . 


పవిత్రమైన ఆలయంలో భగవంతుణ్ణి ప్రసాదం కూడా అంతే పవిత్రమైన మట్టి పాత్రలోనే వండి సమర్పించాలి అని మాత్రం తెలుసు . . . 


 ఈ ప్రసాదాన్ని తీసుకుని భువనేశ్వర్ లోని C.S.I.R లేబరేటరీ అంటే ( కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ ) రీజనల్ రిసర్చ్ లేబరేటరీలో పరిశోధించమని అంటే వారు దీనికి చాలా సమయం అంటే దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు . . . 


అయినా దానికి కావల్సిన పనిముట్లు మావద్ద లేవు


మీరు ఈ ప్రసాదాన్ని డిల్లీ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించుకోండి అన్నారు . . . 


మళ్ళీ అక్కడ నుండి డిల్లీ దాకా తీసుకెళ్తే ఈ సమయంలో అది పాడవుతుంది కదా అని  అన్నారు 


పూరి ఆలయంలోని ప్రసాదం మట్టిపాత్రలో వండబడుతుంది కాబట్టి ఇది పాడవ్వదు అని చెప్పారు


ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవచ్చు


మట్టిపాత్రలో వండే ఆహారం ఎంత విలువైనదో అయితే భునేశ్వర్ నుండి డిల్లీకి వెళ్ళాలంటే సుమారు 36 గంటల సమయం పడుతుంది


అయినా తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్థంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు అన్నారు . . .


వెంటనే ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్ధాన్ని కూడా టెస్ట్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ కేవలం 13 శాతం మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి . .


87 శాతం మైక్రో న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి, లోపించాయి అని తేలింది . . .






అంతే కాదు మట్టిపాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది . . . 


ఇది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం కనుక మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంతవరకు వారికి కళ్ళజోడు రాలేదు . . . 


జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు . . .


మోకాళ్ళ నొప్పులు డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . . .


శరీరానికి కావల్సిన మైక్రో న్యూట్రియన్స్ సక్రమంగా అందుతుంటే


జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . . .


అది మట్టి పాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . . .


అందుకనే భారతదేశం నేలలో అల్యూమినియం తయారీకి కావల్సిన ముడిసరుకు ఎంత ఉన్నప్పటికీ, 


మనవారు మట్టి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు . . .


ఇంతగా మనకి మట్టిపాత్రలు తయారుచేసే కుమ్మరివాళ్ళు మనకి ఎంత గౌరవనీయులో కదా . . . 


ఎలాగంటే అన్నిరకాల మట్టి , పాత్రల తయారీ కి పనికిరావు, 


ఏ మట్టి కుండగా పనికి వస్తుందో ఎలాంటి మట్టితో వంటపాత్రలు చేయవచ్చో గుర్తించి 


యూనివర్శిటీలో చదువుకోకుండానే మనకి ఇంత గొప్ప సేవచేసి మన ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు . . . 


ఇక అర్థమైంది కదా మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి, సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండుకోవాలి. . . 








దానిలో అత్యుత్తమమైన పాత్ర మట్టిపాత్ర . . .



వీటిలో వండిన పదార్ధాన్ని పరిశోధించి చూస్తే, కేవలం

0 శాతం మైక్రో న్యూట్రియన్స్  లోపించాయి . . .

100 శాతం మైక్రో న్యూట్రియన్స్ భద్రంగా ఉన్నాయి. . .




కంచు పాత్ర :







ఇక రెండవ రకంగా మనకి ఉపయోగపడే పాత్ర ఏమైనా ఉన్నదా అంటే


అదే కాంశ్యం, అనగా కంచుపాత్ర . . .


వీటిలో వండిన పదార్ధాన్ని పరిశోధించి చూస్తే,


కేవలం


3 శాతం మైక్రో న్యూట్రియన్స్   లోపించాయి

97 శాతం మైక్రో న్యూట్రియన్స్ భద్రంగా ఉన్నాయి .



ఆహారాన్ని ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతుంది..


కాంస్య పాత్ర ఆరోగ్యానికి మంచిది. 

కాంస్యం మంచి ఉష్ణ వాహకం. 


అందుకే వేడిగా ఉండే ఏదైనా ఆహార పదార్థాన్ని అందులో ఉంచితే అది చాలా సేపు వేడిగా ఉండి.. 

అందులో పోషకాహారం అలాగే ఉంటుంది.


సూక్ష్మజీవుల నుండి రక్షణ…


మీరు ఆహారాన్ని కంచు పాత్రలలో ఉంచినట్లయితే,


మీ ఆహారంలో ఏవైనా సూక్ష్మక్రిములు ఉన్నప్పటికీ, కాంస్యతో సంబంధానికి వచ్చిన కొద్దిసేపటికే అవి చంపబడతాయి.


మీ ఆహారం స్వచ్ఛంగా మారుతుంది.


దోషాల సంతులనం …


మీరు కాంస్య పాత్రలలో నీటిని నిల్వ చేసి..


ఎనిమిది గంటల పాటు ఉంచిన తర్వాత నీటిపై సానుకూల ప్రభావం ఉంటుంది. 


ఇది మీ దోషాలను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.


రక్తాన్ని శుద్ధి చేస్తుంది…


ఆమ్ల ఆహారాలు, పుల్లని పదార్థాలతో కాంస్య చర్య తీసుకోదు. 


కంచు ఆల్కలీన్ మెటల్ కాబట్టి… 


మన రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.


అందంగా మార్చే గుణం..


కంచు లో శరీరం రంగు తెచ్చే గుణం ఉంది. 


దానితో పాటు జీర్ణశక్తి పెంచుతుంది. 


చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 


పైత్యని హరింప చేస్తుంది..

కంటికి కూడ మంచి చేస్తుంది.

అంతేకాదు.. 


కాన్సా ప్లేట్ ఆహారంలోని యాసిడ్ కంటెంట్‌ను తగ్గించగలదని, గట్, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది .


ఇది మంటను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, థైరాయిడ్ బ్యాలెన్స్‌లో సహాయపడుతుంది.


 కంచు పాత్రంలో తినడం, నీటిని త్రాగడం పూర్వం నుంచి వస్తున్న అలవాటు.. 


ఆయుర్వేదం ప్రకారం, కంచు పాత్రలో ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా చెబుతారు.


ఇత్తడి పాత్ర :





ఇక మూడవ ఉత్తమమైన పాత్ర ఇత్తడి . . .


వీటిలో వండిన పదార్ధాన్ని పరిశోధించి చూస్తే, కేవలం


7 శాతం మైక్రో న్యూట్రియన్స్  లోపించాయి. 


93 శాతంమైక్రో న్యూట్రియన్స్ భద్రంగా ఉన్నాయి


ఆహారం రుచి పెరుగుతుంది :


వంట చేసేందుకు ఇత్తడి పాత్రలను వాడటం వల్ల వాటి రుచి పెరుగుతుందని. 


వీటిలో వంట చేసేటప్పుడు ఆ పాత్రల నుంచి సహజ నూనెలు విడుదలవుతాయి. 


ఇవి సహజంగా ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.


జీర్ణక్రియకు మేలు :


టీ తో పాటు ఇతర వంటకాలు ఇత్తడి గిన్నెల్లో చేయడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది  ఇత్తడి పాత్రల్లో వంటచేసేటప్పుడు వాటి నుంచి విడుదలైన పోషకాలు మనం తినే ఆహారంతోపాటు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. 


ఆహారం బాగా జీర్ణమై మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయని వారు చెబుతున్నారు.


రోగ నిరోధకశక్తి పెరుగుతుంది :


ఇత్తడి పాత్రల్లో వాటర్ నింపి పెట్టుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది .


 రాత్రంతా ఇత్తడి పాత్రలో ఉంచిన నీటి తాగితే శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 


ఈ పాత్రలలో ఆహారాలను వండుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.


చర్మ ఆరోగ్యానికి :


ఇక ఇత్తడి చర్మానికి మేలు చేస్తుంది. 


రోజు చాయ్ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఈ పాత్రలను వాడటం వల్ల ఇతర వంటకాల కోసం ఇత్తడి పాత్రలను వాడితే చర్మానికి కూడా మేలు చేస్తుంది. 


చర్మ సమస్యలు, మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.


కాబట్టి మనకి ఉత్తమమైన పాత్రలు 


1 . మట్టిపాత్ర 


2. కంచు పాత్ర


3. ఇత్తడి పాత్ర


అని తెలుసుకోవాలి. 


అప్పుడే మనం ఇండియా పద్ధతి నుంచి భారతీయ పద్దతీ, సంప్రదాయంలోకి అడుగు పెట్టినట్టు


 అంటే ప్రెషర్కుక్కర్ ఆంగ్లేయులు లేదా అమెరికన్స్ కనిపెట్టినవి.


మట్టిపాత్రలు , కంచు , ఇత్తడి మన భారతీయులు చేసినవి కనుక 


కావాలంటే మీకు దీని ఉపయోగం తెలియాలంటే,


డయాబెటీస్ ఏస్థాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి . . . 


సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా వారు డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు . . .


ఆనందంగా జీవిస్తారు . . .


 ఇదే మన వాగ్భటాచార్యుని మొదటి సూత్రం . . .


ఇప్పటికీ దేవాలయాల్లో ఈ పాత్రల్లోనే ప్రసాదం తయారు చేస్తారు . . .


అందుకే అంత రుచిగా ఉంటాయి . . .


మనం నమ్మలేకపోవచ్చు కానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన వారు కూడా


ఈ పాత్రల్లోనే వంట చేసుకుంటారు . . .


ఇక మనం ఎటువంటి మొహమాటం లేకుండా


ఇప్పుడు ఆ పాత్రలు ఎక్కడ నుండి తెస్తాం అనే వంకలు చెప్పకుండా


మన ఆరోగ్యం కోసం మనమే ఎంత కష్టపడి అయినా తెచ్చుకుని


ఈ పాత్రల్లోనే ఆహారం వండుకుందాం . . . 


ఆరోగ్యంగా జీవిద్దాం . . .



✍🏻 . . . రామ్ కర్రి

జ్ఞానాన్వేషి 🧠,   ధర్మ రక్షక్ 📿,   నవ యువ కవి 📖,

 రచయిత ✒️,   బ్లాగర్ 🪩 ,.  టెక్ గురు 🖥️ ,  

 సామాజిక కార్యకర్త 🩸 , 

📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 

🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , 

మరియు 

🛕 జ్ఞాన కేంద్ర 🚩

వ్యవస్థాపకులు . . .




రిఫ్రిజరేటర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం . . . 


ఇందులో కూడా గాలి, సూర్యరశ్మి చేరదు ఇంకా ఇందులో సహజంగా మన ఇంట్లో ఉండే ఉష్ణోగ్రతకంటే చాలా తక్కువ ఉంటుంది . . .


 అది కూడా ప్రకృతి సహకారంతో జరిగితే ఏ ప్రమాదమూ ఉండదు కానీ అలా జరగటంలేదు. . .


ఇది కొన్ని రకాల గ్యాస్లను విడుదల చేస్తూ రిఫ్రిజరేటర్లోని ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటుంది. . .


ఆ గ్యాస్లు 12 రకాల గ్యాస్ల ను విడుదల చేసేలా తయారుచేస్తారు.


 వాటిని విజ్ఞానశాస్త్రంలో C.F.C. (క్లోరో, ఫ్లోరో, కార్బన్స్) అంటారు.


 అంటే క్లోరిన్ ఫ్లోరిన్ కార్బన్జయాక్సైడ్ ఉన్నది. 


వీటికి అర్థం మనం డిక్షనరీలో చూస్తే విషం ఎక్కువ విషం, భయంకరమైన విషం అని ఉంటాయి. 


ముఖ్యంగా మనం గాలి పీల్చి వదులుతూ ఉంటాము. కదా మనం వదిలేగాలినే కార్బన్ డయాక్సైడ్ అంటారు.


 దీన్ని మనం వదలకుండా కాసేపు మనలో ఉంచుకుంటే ఖచ్చితంగా మరణిస్తాము.


 అంత భయంకరమైన విషం విడుదల చేసేది రిఫ్రిజరేటర్,


ఇలాంటివే మొత్తం 12 రకాల విషవాయువులను విడుదల చేస్తుంది. 


ఇది ఇంకా ఎంతటి ప్రమాదమంటే మనం రిఫ్రిజరేటర్లో ఉంచే ప్రతిపదార్థం మీద ఈ విషప్రభావం ఉంటుంది.


 మనం ఎంత స్టీలు గిన్నెలో పెట్టి మూతపెట్టి ఉంచినా వాటిని చేదించుకుని లోపలి పదార్థంమీద వ్యాపిస్తుంది.


ఇంతటి ప్రమాదకర వస్తువుని ఎందుకు తయారుచేశారు.


ఏదో కారణం ఉండాలి కదా ! 


అమెరికా, కెనడా వంటి చల్లని వాతావరణం ఉండే యూరోపియన్ దేశాల వారికి కొన్నిరకాల అల్లోపతి మెడిసన్ను కావలసిన ఉష్ణోగ్రతలో ఉంచుకుని ఉపయోగించుకునే ఉద్దేశంతో వారు రిఫ్రిజరేటర్ను తయారుచేశారు.


 అంతేకాని నీళ్ళు, కూరగాయలు పెట్టుకునే ఉద్దేశంతో కాదు 


అంతకన్నా ముఖ్యంగా మొట్టమొదట దీన్ని ఆవిష్కరించింది మిలటరీ సైన్యంవద్ద వారి ఆరోగ్య సంరక్షణకోసం మందులు నిల్వచేసుకునేందుకోసం మాత్రమే మన భారతదేశంలో దాని అవసరం చాలా తక్కువ . . .


ఎక్కడైనా కొన్ని పదార్థాలు దొరకనివి నిల్వ చేసుకునేందుకు ఉపయోగిస్తారు. . . 


అంతేకానీ ప్రతిరోజూ దీని ఉపయోగించుకునేందుకు కాదు . . .


మన ఇంట్లో అతి భయంకర వస్తువు ఏదైనా ఉందంటే అది రిఫ్రిజరేటర్ మాత్రమే అని చెప్పవచ్చు . . .


స్వస్తీ . . .