.
.
ఇదొక పరమపద సోపాన పటము . . .
మనం సాధారణంగా 'పాము పటం' ( వైకుంఠ పాళి ) గా పిలిచే ఈ పటంలో పాచికలు విసురుతూ
మనం ( మన పావు ) ' నిచ్చెన గడి' లోకి వెళ్ళినప్పుడల్లా మనం పైపైకి వెళుతూ ఉంటాం . . .
అలా కాక ఎప్పుడైనా 'పాము గడి' లోకి వెళితే జర్రున కిందికి జారిపోతాం . . .
జాగ్రతగా పాముల్ని తప్పుకుంటూ . . .
నిచ్చెనలు ఎక్కుతూ పైపైకి సాగే వ్యక్తే అంతిమంగా గమ్యస్థానం చేరుకుని విజేతగా నిలుస్తాడు . . .
ఇక ఈ పటం కొంచెం భిన్నమైంది . . .
మనం ఏమేమి చేస్తే ఆరోగ్యంగా ఉంటామో,
ఎలా జీవిస్తే, లేక ఏ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనం రోగాలబారిన పడకుండా సుదీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తామో ఇది వివరిస్తుంది . . .
చక్కటి ఆరోగ్యం కోసం ఏమి చేయాలో 'నిచ్చెన గదులు' సూచిస్తే,
ఏమి చేయకూడదో 'పాము గడులు' వివరిస్తాయి . . .
చిత్రాన్ని కాస్త జూమ్ చేసి చూస్తే ఆరోగ్యం కోసం ఏమి చేయదగినవో, ఏమేమి చేయదగనివో తెలుసుకోవచ్చును . . .