.
ఆయుర్వేద జీవన విజ్ఞాన పిపాసులైన సంజీవని ఔషధ వన ఆశ్రమ పాఠకులారా 🙏🏻
ఈ రెడ్డివారి నానుబాలు అనే మొక్క వర్షాకాలంలో పుడుతుంది.
ఇండ్లముందు మెట్లచుట్టూ, గోడలచుట్టూ, నీటిచెమ్మవుండే ప్రదేశాలలో, పంటపొలాలలో, గట్లపైన ఎక్కడబడితే అక్కడ ఈమొక్క లభ్యమౌతుంది.
ఇది ఎన్నో రహస్య శక్తులను తనలో నింపుకున్న సిద్ధ మూలిక,
అందుకే ఈ మూలికను గురించిన వందలాది యోగాలు రహస్యంగా దాచబడినయ్.
అయితే, ప్రజలను కాపాడగల మొక్కల గురించి దాచడం ధర్మం కాదు కాబట్టి కొన్ని ముఖ్యమైన దీని యోగాలను మీకందిస్తున్నాం . . .
మీరు అందుకొని ఆరోగ్యాన్ని పొందుకొని అందరికి పంచిపెట్టవలసిందిగా సూచిస్తున్నాం . . .
రెడ్డివారి నానుబాలు - పేర్లు
సంస్కృతం లో దుగ్గికా అని, హిందీలో మగ్గి అని,
తెలుగులో రెడ్డివారినానుబాలు, పాలకాద, గొర్రెకాడ, నాగార్జుని, పచ్చబొట్లకు అని,
లాటిన్లో Euphor hio Pilulifera wood Australian Asthama Werd wot th
రెడ్డివారి నానుబాలు - రూప గుణ ధర్మాలు
ఈ మొక్క ఎరుపు తెలుపు బేధాలతో రెండు రకాలుగా వుంటుంది.
అందులో కూడా చిన్నది పెద్దది అనే రెండు రకాలుగా కూడా దొరుకు తుంది.
సారవంతమైన భూమిలో ఒకడుగు ఎత్తువరకు పెరిగే పెద్దరెడ్డివారి నానుబాలు కన్నా సన్నగావుండి చిన్నదిగా పెరిగే చిన్నరెడ్డివారి నాను బాలు మొక్కే శ్రేష్టమైనది.
పచ్చబొట్లాకని - ఎందుకంటారు ?
దీని ఆకులను దంచి తీసిన రసంతో పూర్వ కాలంలో పచ్చబొట్లు పొడిచేవారు.
అందువల్ల దీనికి పచ్చబొట్లకు అనే పేరు స్థిరపడింది.
నాగార్జుని - అని ఎందుకంటారు ?
శాతవాహనుల కాలంలో వరుసగా అనేక సంవత్సరాలు వర్షాలు పడక కరువు కాటక మొచ్చింది.
ప్రజలు దరిద్రంతో ఆకలితో అల్లాడి పోతుంటే సిద్ధ నాగార్జునుడు ప్రకృతిపైన ఆగ్రహించి శ్రీపర్వతాన్ని
ఈ రెడ్డి వారి నానుబాలు ఆకురసంతో బంగారు కొండగామార్చారు.
అమ్మవారు ప్రత్యక్షమై ఇది సృష్టి కి విరుద్ధమైన పని అని నాగార్జునుని వారించి వర్షాలు కురిపించి నాగార్జుని చేత బంగారు కొండగా మారిన శ్రీ పర్వతాన్ని తిరిగి రాతి పర్వతంగా మార్పించింది.
అందుకే ఆనాటి నుండి ఈ మొక్కను నాగార్జునుడి పేరుతో నాగార్జుని అంటారు.
రెడ్డివారి నానుబాలని - ఎందుకంటారు ?
సిద్ధ నాగార్జునుని బాటలోనే వేమన కవి గా మారిన వేమారెడ్డి గారు కూడా ఈ పాలకానరసం తోనే బంగారాన్ని తయారు చేయడం వల్ల ఆయన పేరు మీదుగా ఈ మొక్కకు రెడ్డివారి నానుబాలు అనే పేరు వాడుకలోకి వచ్చింది.
రెడ్డివారి నానుబాలు - గుణ ధర్మాలు
ఇది తీపి, కారము, చేదు రుచులుకలిగి అనేక రోగాలను హత మారుస్తుంది.
ఆ ప్రయోగాలు వరుసగా చెప్పకుందాం.
బాలెంతలకు - పాలు పెరగాలంటే ?
రెడ్డివారి నానుబాలు ఆకును పప్పులో వేసి, రెండు పూటలా బాలెంతలు తింటూవుంటే వారికి సమృ ద్దిగా తల్లిపాలు పెరుగుతాయి.
మధుమేహానికి - మంచి యోగం
మధుమేహంతో బలహీనులై నేత్ర రోగాలతో నరాల జబ్బులతో రోజు రోజుకు కృంగి కృశించి పోయేవారికి ఇది అమృతవర్షిణిలా ఉపకరిస్తుంది . . .
ఈ మొక్కలను సమూలంగా తెచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి దంచి జల్లించి ఆ పొడిని నిలువచేసుకోవాలి.
రోజూ రెండు పూటలా ఆహారానికి అరగంట ముందు అరచెంచా పొడిని అరగ్గాసు నీటితో సేవిస్తుంటే మధుమేహం అదుపులోకి రావడమే కాక నేత్రాలకు వెలుగు వస్తుంది.
నరాలకు బలం కలుగుతుంది.
క్షీణించిన వీర్యధాతువు తిరిగి ఉత్పన్నమై వీర్యబలం పెరుగుతుంది.
కంతులకు గ్రంథులకు కమ్మని యోగం
శరీరంపైన ఈనాడు చాలామందికి గట్టి రాయి లాగావుందే కంతులు, గ్రంథులు పుడుతూ వున్నయ్.
రోజూ రెండుపూటలా ఈ మొక్కను గిల్లగా వచ్చిన పాలను కంతులపైన రుద్దుతూవుంటే ఆ కంతులు, గ్రంథులు క్రమంగా కరిగిపోతయ్.
కంటి రోగాలకు - కమనీయ యోగం
సన్నగావుండే చిన్నరెడ్డివారి నానుబాలు మొక్కను గిల్లి దానికాడకు అంటివున్న పాలను ఒక చుక్క కంటిలో పెట్టి పావు గంట సేపు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి.
వేడి శరీరులు రెండు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టుకోవాలి.
మిగిలిన వారంతా ప్రతిరోజూ ఒకసారి కంటిలో పెట్టు కోవచ్చు.
దీనిపాలు చల్లగా వుంటయ్,
వరుసగా ఇరవై రోజులపాటు పెట్టుకొని పదిరోజులు ఆగి
మళ్ళీ ఇరవై రోజుల పాటు పెట్టుకోవచ్చు.
ఇలా చేస్తుంటే కంటిమసకలు, కంటిపూలు, కంటిపొరలు క్రమంగా కరిగిపోతాయి.
పూర్తిగా కంటిచూపు కోల్పోయి కంటి నెల్లగుడు తెల్లగా మారిన అభాగ్యులు రోజూ ఉదయంపూట ఈపాలను కంట్లో పెడుతూ ఒక పచ్చిమొక్కను తీసుకొని దాని ఆకులను నమిలి తిని ఒక గంట వరకు మరేమీ తినకుండా వుంటే కొంత కాలానికి కంటిలో మార్పువచ్చే అవకాశముంటుంది.
విశ్వాసంతో ప్రయత్నించండి.
సంతానం లేని - స్త్రీ పురుషులకు
పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన చిన్నరెడ్డి వారి నానుబాలు మొక్కలను సేకరించి శుభ్రంగా కడిగి అరబెట్టి పైన తెలిపినట్లు పొడి చేసుకొని ఆ పొడితో సమానంగా కండ చక్కెర పొడి కలిపి ఒక గాజు సీసాలో నిలువవుంచుకోవాలి.
రోజూ రెండుపూటలా భార్య భర్తలు ఇరువురు సూర్యోదయ వేళ ఒకటీ స్పూన్ మోతాదుగా ఈ పొడిని మంచినీటితో సేవించి ఒక కప్పు కండచక్కెర పొడి కలిపిన ఆవుపాలు సేవిస్తూ
నలభై రోజుల పాటు పూర్తిబ్రహ్మచర్యం పాటించాలి.
ఇలా చేస్తుంటే స్త్రీలలో బహిష్టు సక్రమమై అండం సమయానికి విడుదలౌతుంది.
అలాగే, పురుషుల్లో వీర్యకణాల శక్తి పెరిగి సంతానయోగ్యత కలుగుతుంది.
ఇది సేవించేటప్పుడు కారం, ఉప్పు బాగా తగ్గించాలి.
పులుపు పూర్తిగా మానివేయాలి.
ఇంట్లో తయారుచేసిన నేతి పిండివంటలు భుజించాలి.
ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవుపెరుగు, సమృద్ధిగా సేవించాలి.
ఇది మన భారతీయ సిద్ధ పురుషులు అందించిన మహా రహస్యమైన యోగం . . .
- స్వస్తీ . . .
.