సృష్టికి మూలం శృంగారమే ! . . . 

బ్రహ్మచారి అయిన ( మల్లినాగుడు ) వాత్స్యాయనుడు 

క్రీ.శ. మూడో శతాబ్ధంలో  ' కామసూత్ర ' అనే గ్రంథం లో 1,250 పైగా సూత్రాలకు శ్రీకారం చుడుతూ . . .


 ' ధర్మార్ధకామే భ్యోనమః '  - ధర్మ, అర్ధ, కామాలకు నమస్కారం అన్నాడు. 

ఎనభై ఏడు రతి భంగిమల గురించి తన గ్రంథం లో సమగ్రంగా వివరించాడు.

శృంగార దీపిక లో హరిభట్టు అయిదు కామసూత్రాలను ఇలా వివరించాడు.


' అంగుల్యా నాభిమధ్యేతు చాలనం పేటితంస్మృతం' - చేతివేళ్ళను చెలి బొడ్డు నడుమ చెలింపజేయడాన్ని 'పేటితం' అంటారు.


'మధ్యమానామి కాంగుల్య మన్మధాలయ చాలనం తత్కుట్టి తమిత ప్రోక్తంకలవాద్భిర్మినీభిః ' - నడిమి వేలు ఉంగరపు వేలును మర్మస్ధానంపై చెలింపజేయడాన్ని 'కుట్టితం' అంటారు.


'నభై పాదతలే ఘర్షః క్లీతంతు పరికీర్తితం' - గోళ్ళతో అరికాళ్ళను మెల్లగా రాయడాన్ని  'క్లీతం'  అంటారు.


'చికురాకర్షణం నామనామితం పరికీర్తితం' - తలవెంట్రుకలను మెల్లగా లాగడాన్ని 'నామితం' అంటారు.


'యధాంకుష్ఠేన తర్జన్యా చిబుకం పరిపీడ్యుతే ఘట్టితం తత్పరి ఖ్యతం' - బొటన వేలి సహాయాన చూపుడు వేలుతో గడ్డాన్ని గట్టించడం (మీటడం) దీన్ని 'ఘటి(ట్టి)తం' అంటారు.


శృంగారంలో 

'విభావం'  

'అనుభావం'

 'స్వాతిక భావం' 

'సంచారి భావం'  

అనేవి అయిదు భావాలు. 


అలాగే శృంగార చేస్టలు 

'భావము' 

'హవము'

 'హేల' 

'విలాసము' 

'మాధుర్యము' 

'థైర్యము' 

'విభ్రమము' 

'లీల' 

'కిలికించితము'

 'మొట్టాయితము' 

'లలితము' 

'విఛ్చుత్తి' 

'బొబ్బకము' 

'విహృతము' 

'చకితము'

 'హసితము' 

'కుట్టిమితము' 

కుతూహలము' 

అనేవి పధ్ధెనిమిదిగా చెప్పబడ్డాయి. 


శృంగారంలో పాల్గోనే ప్రియురాలు 

'చక్షుప్రతి' 

'చింత' 

'సంస్కృతి' 

'గుణకీర్తన'

 'ఆరతి'

 'తాపము' 

'లజ్జాత్యాగము'

 'గమనము' 

'మూర్ఛ' 

'ధన్యత' 

వంటి అనుభూతులకు లోనౌతుంది. 


అష్టవిధ శృంగారనాయకలు అంటే !

 స్వాధీనపతిక, 

వాసకసజ్జిక, 

విరహోత్కంఠిత, 

విప్రలబ్ధ, 

ఖండిత, 

లహాంతరిత, 

ప్రోషితభర్తృక, 

అభిసారకాయని 

అనేవారు.


అసలు శృంగారం గురించి తొలుత 

నంది, 

శ్వేతకేతు, 

భాభ్రవ్య, 

దత్తక 

వంటి వారు ఎన్నడో ప్రస్తావించారు. 


అందుకు రతీమన్మధులు ఆధ్యులు

మన్మధుడు శివ కేశవుల పుత్రుడు. 

ఇతను గొప్ప సౌదర్యమూర్తి చిలుక ఇతని వాహనం. 

మన్మధునికి 

మీనకేతుడు, 

మకరధ్వజుడు, 

పుష్పధ్వనుడు, ( పార్వతీదేవి శాపంవలన )

 అనుంగుడు అని, 

మనోజుడు, 

భావజుడు ( శరీరం లేనందున ) 

ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. 


దక్షుని దేహస్వేదం నుండి పుట్టిన 'రతీదేవి' మన్మధుని అర్ధాంగి. 

మన్మధుని పంచబాణుడిగా కూడా అంటారు.

 వీటి పైన భిన్నఅభిప్రాయాలు ఉన్నప్పటికి 

అవి 

'అరవిందము' 

'అశోకము' 

'ఆమ్రమంజరి'

 'నవమల్లిక'

 'నీలోత్పలము' 

అనేవి పంచబాణాలు. 


చెరుకుగడనే విల్లుగా ధరించి తన సమ్మోహనాస్త్రాలను ప్రయోగించే మన్మధుని

 'సుమబాణుడు' 

'కాముడు' 

అని కూడా అంటారు. 

ఈ సుమబాణుడు తన మీన్మధ శరాలు శివునిపై సంధించిన విషయం మనకు తెలిసిందే!



మన్మధుడు ప్రయోగించే ఈ పంచబాణాలు గురిచేసే పీడన గురించి తెలుసుకుందాం! 

అవి 

'ద్రవణ'

 'శోషణ' 

'తాపన' 

'మోహన' 

'ఉన్మాద' 

అనేవి. 

ఈ విరిశరాలు 

అకార, 

ఇకార, 

ఉకార, 

ఎకార, 

ఓకారాలని 

అధర్వవేదం చెపుతుంది. 


హరిణం, 

హస్తి, 

పతంగం, 

భృంగం, 

మీనం 

అనే ఈ ఐదు 

శబ్ద, 

స్మర్శ, 

రూప, 

రస, 

గంధ 

పంచేంద్రియాలని తృప్తి పరిచే ఆశతో నశిస్తాయి

ఇవన్ని 

మదనతాపాన్ని పెంపోందించే తీయ్యనిబాధలే, 

ఆనంద పూరిత ఉద్రేక భావాలే. 

మన్మధుని పంచబాణ లక్ష్యాలు

 'హృదయం' 

'స్తన' 

'నేత్ర' 

'శిర' 

'గుహ్య'లు అయిదు 

స్త్రీలలో కామోవస్తను కలిగి ఉంటాయి. 


ఈ పంచబాణ విలాసంలో పంచతంత్రం కూడా ఉంది. 

అదే హరిభట్టు తన శృంగారదీపిక లో కామశాస్త్ర పరిభాషలో వీటిని వివరించాడు.


మన్మధుని పేరిట 'మదన త్రయోదశీ వ్రతం' అనే ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. 

దీన్నే 'కామత్రయోదశి' అని కూడా అంటారు. 

చైత్ర శుక్ల త్రయోదశి నాడు మన్మధుడు సతీ సమేతంగా మురళి మోగిస్తూ ఉంటాడని ఉత్తరాన,పశ్చిమతీరంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 


దీనికి నెల రోజులు ముందుగా 'హౌళికా పూర్ణిమ'ను జరుపుకుంటారు. 

ధర్మ అర్ధ కామ మోక్షా శాస్త్రాలను పురుషార్దాలు అంటారు.

 'కామికానివాడు మోక్షకామి కాడు' అంటాడు మన ప్రజాకవి వేమన

సంస్కృతంలో 

యశోధరుడి జయ మంగళ వ్యాఖ్యా, 

వీరభద్రుడి కందర్ప చూడామణి, 

భాస్కర నృసింహశాస్త్రీ కృతసూత్ర వృత్తి ప్రధాన వ్యాఖ్యలు, 

వరాహిమిహిరుడి 'బృహత్సంహితం' లో

 కామసూత్ర ప్రస్తావన ఉంది. 


కాళిదాసు, దండి, భవభూతి వాత్స్యాయనుడి గురించి ప్రస్తావించారు. 


కుమారసంభవంలో శివపార్వతుల ప్రణయకలాపాన్నికళ్ళకు కట్టినట్లు వర్ణించాడు కాళిదాసు. 


రామాయణంలో రావణుడి అంతఃపురంలో, వనంలో శృంగారాన్ని చెప్పుకొచ్చాడు వాల్మీకి.


 ఇక రస శ్రీనాధుడు సరే సరి. 


అన్నమయ తన శృంగారపద గీతాలతో ఏడుకొండలవాడిని పరవసింపజేసాడు.


 జయదేవుని గీతగోవిందం, 

ముద్దుల పళని రాధికాస్వాంతనం

భక్తిని రక్తిని రసవత్తంగా మనహృదయాలను హత్తుకునేలాచేసారు. 


కూచిరాజు ఎర్రన రాసిన 'కొక్కోకం' తెలుగులో రతి శాస్త్రగ్రంధం గా పేరుపొందింది. 


పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు, సంకుసాల నరసయ్య గారు రాసిన కపకర్ణ రసాయనం మాంధాత మహీపతి సంభోగ శృంగార నైపుణ్యాన్ని వర్ణిస్తూంది.





- స్వస్తీ . . .