నారికురుపులు నశించుటకు

అత్తపత్తిఆకులు మెత్తగానూరి నారికురుపులపై వేసి కట్టుకడుతూవుంటే అవి నశించిపోతయ్.

* గోంగూర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.


చల్ది, మశూచికములకు

అత్తపత్తి ఆకు 30 గ్రా॥ మిరియాలు 2 గ్రా॥ ఈ రెంటిని మెత్తగానూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి. రెండుపూటలా ఒకమాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూవుంటే చెల్దికురుపులు మశూచికం గండమాల హరించిపోతయ్.

* చేపలు, మాంసం, వేడిపదార్థాలు నిషేధం



వ్రణాలకు -అత్తపత్తి

అత్తపత్తిఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపుకలిపి సూరి కురుపులపైన, పుండ్లపైనవేసి కట్టుకడుతూవుంటే క్రమంగా ప్రణాలు మాడిపోతయ్.



బోదకాలి మంట, పోటుకు

అత్తపత్తిఆకు 5 గ్రా॥, మిరియాలు 9 ఒకకప్పు నీటితో మెత్తగానూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజులపాటు సేవించాలి. దీనితోపాటు

అత్తపత్తిఆకును ముద్దగా నూరి బోదకాలి పైన పట్టులాగావేసి కట్టుకడుతూవుంటే మంట, పోటు, బాధ తగ్గిపోతయ్.

*మాంసం, చేపలు, నంజుపదార్థాలు నిషేధం


కాలినగాయాలకు - కమ్మనిలేపనం

బాగాపండిన అరటిపండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనంచేస్తే మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతయ్.


తెల్లబొల్లి మచ్చలు - తగ్గుటకు

అరటిచెట్టుదూటరసంతీసి తగినంత పసుపు కలిపి పైన లేపనం చేస్తూవుంటే తెల్లబొల్లి త్వరగా నివారించ బడుతుంది


పెద్దపెద్ద పుండ్లు - తగ్గిపోవుటకు

మెత్తటి అరటిపండ్లు వేడి అన్నం, గేదెపేడ సమంగా కలిపి మెత్తగా పిసికి పైనవేసి కట్టుకడుతూవుంటే క్రమంగా ఆపుండ్లు మానిపోతయ్.


శెగరోగములు - హరించుటకు

అరటిదుంపరసం 20గ్రా॥ పటికబెల్లంపొడి 20గ్రా॥ కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే తెల్లశెగ, ఎర్రశెగ, పచ్చశెగ తగ్గిపోతయ్. 


సెగగడ్డలు - తగ్గిపోవుటకు

అవిసెగింజలు, పసుపుకొమ్ములు సమంగా తీసుకొని మెత్తగానూరి గడ్డలపైనవేసి కట్టుకడుతూ వుంటే మూడురోజులలో గడ్డలుపగిలిపోయి పుండు మాడిపోతుంది.



✍🏻 . . . రామ్ కర్రి జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , సామాజిక కార్యకర్త 🩸 , 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , మరియు 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . www.ramkarri.org 8096339900