బాలపాపచిన్నెలు -హరించుటకు
అక్కలకర్రవేరును దారంతో చుట్టి పిల్లల మెడలో వేస్తే పిల్లలకు చంటిబిడ్డగుణాలు, బాల పాపచిన్నెలు మొదలైనవి అంటుకోవు.
నత్తి తగ్గుటకు - అక్కలకర్ర
రోజూ అక్కలకర్రవేరు ముక్కను కొద్దిగా గంధం తీసి నాలుక పైన కొద్దిగా మాత్రమే రాస్తుంటే నత్తి తగ్గిపోతుంది. ఎక్కువరాస్తే పుండుపడుతుంది జాగ్రత్త.
బలహీనమైన పిల్లలకు - అశ్వగంధ
పైన చెప్పినట్లు శుద్దిచేసిన దుంపలను ఎండించి దంచి పొడిచేసి వాటితో సమంగా పటికబెల్లంపొడి కలిపి నిలువవుంచుకోవాలి. బలహీనంగా వుండే బిడ్డ లకు, బుద్ధిబలం లోపించిన బిడ్డలకు ఒక చెంచాపొడి ఒకకప్పు వేడిపాలతో కలిపి సేవింపచేస్తుంటే శారీరక బలం, బుద్ధిబలం పెరుగుతయ్.
గవదబిళ్ళలకు -గట్టియోగం
ఆవిశాకు, కొద్దిగా గుల్లసున్నం కలిపినూరి పైన పట్టించి దూది అంటిస్తూవుంటే గవదబిళ్ళలు తగ్గి పోతయ్. లేక ఒట్టి ఆకురసమైనా పైనపూస్తుంటే ఆ బిళ్ళలు కరిగిపోతయ్.