అరటిపూవు - వడియాలు
ఇవి రుచికరంగా వుండి దగ్గు, ఆయాసం మొదలైన శ్వాసరోగాలను పోగొట్టి బలం కలిగిస్తయ్.
అరటిఆకు - భోజనం
మనసుకు ఇంపుగా వుంటుంది. జ్వరం, క్షయ, కఫవాతం, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధులను అణచివేచి జఠరాగ్నిని వీర్యబలాన్ని ఆయువును పెంచుతుంది. విషప్రభావాన్ని హరించివేస్తుంది
ఉబ్బసరోగం - తగ్గుటకు
రోజూ ఉదయంపరగడుపున ఒక చక్కెరకేళీ అరటి పండును తగినంత గోమూత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే అతిదారుణమైన ఉబ్బస రోగం అతిత్వరగా తగ్గిపోతుంది
పాతదగ్గులు - పారిపోవుటకు
అరటిపండును తొక్కతీసి ఆపండుమధ్యలో చిటికెన వెలుపెట్టి పొడిచి గుంటలాగాచేసి ఆ గుంటలో ఒకగ్రాము మిరియాలపొడి వేసి ఆపండును ఒకమోతాదుగా రోజూ రెండుపూటలా తింటూవుంటే చాలాకాలంనుంచి వేధించే దగ్గు తగ్గిపోతుంది.
దగ్గు, రొమ్ము, పడిశం
అక్కలకర్రవేర్లను దంచి జల్లించి నిలువ వుంచుకోవాలి. ఒకటి లేదా రెండు చిటికెల పొడిని ఒకచెంచా తేనెతో కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే కఠినమైన దగ్గులు, గడ్డకట్టుకుపోయిన రొమ్ముపడిశం హరించి పోతయ్.
ఉబ్బసమునకు - ఉధృతయోగం
అశ్వగంధపొడి 50గ్రా॥, దోరగావేయించిన కుర సాని ఓమపొడి 20గ్రా॥, దోరగా వేయించిన జీలకర పొడి 50గ్రా॥, దోరగావేయించిన వాముపొడి 50గ్రా॥, కరక్కాటకశృంగిపొడి 50గ్రా॥ సమంగా కలిపి నిలువ వుంచుకోవాలి. దీనిని రెండుపూటలా ఆహారానికి ముందు 3 గ్రా॥ మోతాదుగా వేడినీటితో సేవిస్తుంటే దగ్గు, ఉబ్బసరోగం హరించిపోతయ్.
ఉబ్బసానికి - అడ్డసరం చుట్ట
అడ్డసరం ఆకులు మరియు వేర్లపైవుండే బెరడు ఈరెండింటిని కలిపి పొడికొట్టి నిలువవుంచు కోవాలి. ఈపొడిని పొగతాగే చిలుముగొట్టంలో పోసి అంటించి ఆపొగ పీలుస్తూవుంటే క్రమంగా ఉబ్బసం హరించి పోతుంది.
క్షయదగ్గు - తగ్గుటకు
అడ్డసరపాకురసం 20గ్రా॥, తేనె 5 గ్రా॥ కలిపి ఒకమోతాదుగా రెండుపూటలా రోజూ సేవిస్తూ వుంటే క్రమంగా క్షయదగ్గు పూర్తిగా తగ్గిపోతుంది.
అన్నిరకాల - శ్లేష్మరోగాలకు
అడ్డసరపాకురసం20గ్రా॥, అల్లంరసం20గ్రా॥ కలిపి రెండుపూటలా మూడురోజులపాటు తాగుతూ వుంటే గొంతులో అడ్డుపడే కఫమంతా కరిగి పడి పోయి శ్లేష్మసమస్య నివారించబడుతుంది.
అనేకరోగాలకు - అడ్డసరలేహ్యం
తయారీవిధానం :ఒక కేజీ అడ్డసరపాకులను
కొంచెం నలగ్గొట్టి ఎనిమిదికేజీల మంచినీటిలోవేసి రెండుకేజీల కషాయం మిగిలేవరకు మరిగించి దించి వడపోసుకోవాలి. ఈకషాయంలో పటిక బెల్లంపొడి ఒక కేజీ మరియు కరక్కాయ బెరడు పొడి 640గ్రా॥ కలిపి చిన్నమంటపైన వండాలి. ఆపదార్థం గడ్డ కడుతూ పాకానికి వచ్చినతరువాత అందులో తవాక్షీరి చూర్ణం 40గ్రా॥ దాల్చినచెక్క పొడి10గ్రా॥ పిప్పళ్ళ పొడి 20గ్రా॥ ఆకుపత్రి పొడి 10గ్రా॥, ఏలకుల పొడి 10గ్రా॥, నాగకేసరాల పొడి 10గ్రా॥ వేసి బాగా కలదిప్పాలి. పాత్రనుదించి చల్లారిన తరువాత అందులో తేనె 80గ్రా॥ కలపాలి. ఇదే అద్భుతమైన అడ్డసరలేహ్యం.
వాడేవిధానం : పూటకు 5 గ్రా॥ మోతాదుగా రెండుపూటలా తిని ఒకకప్పు ఆవుపాలు తాగాలి.
లాభాలు : పిల్లల కొరింతదగ్గులు, పిల్లల మరియు పెద్దల మలబద్దకం, అతిదాహం, కడుపు పొంగు, క్షయరోగం, ఉబ్బసరోగం, దగ్గు, పడిశ భారం, గుండె బలహీనత మొదలైనవన్నీ హరించి పోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
రక్తపిత్తరోగానికి - అడ్డసరం
దగ్గితే నోటివెంట రక్తంపడే సమస్యను రక్తపిత్తం అంటారు. ఈసమస్యకు అడ్డసరం ఆకురసం 20గ్రా॥, కండచక్కెరపొడి10గ్రా॥, తేనె5గ్రా॥ కలిపి పూటకు ఒకమోతాదుగా రెండుపూటలా సేవిస్తుంటే రక్తం పడటం వెంటనే ఆగిపోతుంది.
మొండి ఉబ్బసానికి - జగమొండియోగం
అడ్డసరపాకురసం 10గ్రా॥, వాకుడుపండ్లరసం 10గ్రా॥, ఉత్తరేణి ఆకురసం 10గ్రా॥ తేనె20గ్రా॥ కలిపి రోజూ పరగడుపున సేవించాలి. ఇదేరసాన్ని తేనె కలపకుండా సాయంత్రంపూట సేవించాలి. ఇలా చేస్తుంటే అతిమొండి ఉబ్బసరోగం అయినా 40 రోజులలో తగ్గిపోతుంది.
ఉబ్బసానికి - ఉధృతమైనయోగం
దోరగా వేయించిన అవిసెగింజలు 40గ్రా॥.. దోరగావేయించిన మిరియాలు 10గ్రా॥ తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి వుంచుకోవాలి. రోజూ రెండుపూటలా 3గ్రా॥ పొడి ఒకచెంచా తేనెతో కలిపి తింటూవుంటే మూడు, నాలుగు వారాలలో ఉబ్బస వ్యాధి పూర్తిగా హరించి పోతుంది.