అన్నిరకాల - కడుపునొప్పులకు
అరటిచెట్టును ఎండబెట్టి కాల్చి బూడిదచేసి జల్లించి పెట్టుకోవాలి. ఈ బూడిదను 1లేక2 గ్రాముల మోతాదుగా ఒకకప్పు నీటిలో కలిపి రోజూ మూడు పూటలా తాగుతూవుంటే ఉదరరోగాలు తగ్గిపోతయ్.
పులిత్రేన్పులు - త్వరగా తగ్గుటకు
అరటిఆకులను బాగా ఎండబెట్టి కాల్చి జల్లించి నిలువవుంచుకోవాలి. ఆ బూడిదను ఒకటి లేక రెండు చిటికెలు మోతాదుగా ఒకచెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటూవుంటే త్రేన్పులు తగ్గిపోతయ్.
సుఖవిరేచనానికి - స్టౌల్యహరానికి
అవిశాకుతో ఆకుకూరవండి తింటుంటే సుఖ విరేచనం కావడమేకాక పొట్ట మొదలైనచోట్ల అతిగా పెరిగిన కొవ్వుమొత్తం కరిగిపోయి నడుము సన్నగా తయారౌతుంది.
అనాదినుండి మనదేశంలో ముఖ్యంగా పశు వులకు అవిశాకును తినిపించడం ఈనాటికికూడా కొన్నిప్రాంతాల్లో ఆచారంగా వుంది. ముఖ్యంగా ఎద్దులకు, కోడెలకు ఆఆకును తినిపిస్తారు. ఎందు కంటే శరీరాన్ని దృఢంగా వుంచుతూ అతికొవ్వు లేకుండా ఆరోగ్యంగా వుండడంకోసం ఈఆకును తిని పిస్తారు. ఈకూరను వండుకొని తినడం కూడా మన ఆచారంలోనే వుంది.
నీళ్ళవిరేచనాలు - రక్తమొలలు
అత్తపత్తి సమూలచూర్ణం 3 నుండి 5 గ్రా॥, పంచదార ఒకచెంచా కలిపి రెండుపూటలా సేవిస్తుంటే అతిసార విరేచనాలు, రక్తమొలలు హరించిపోతయ్.
*విరేచనకర పదార్థాలు నిషేధం.
బల్లరోగానికి - పెరిగినపొట్టకు
అవి సెగింజలను ఆముదంగింజలను నమ భాగంగా తీసుకోవాలి. ఆముదపు గింజలను పగులకొట్టి పై పెచ్చులుతీసివేసి లోపలిపప్పుతో పాటు అవిసెగింజలను కూడాకలిపి తగినన్ని నీటితో మెత్తగాముద్దలాగా కొంచెం పలుచగా వుండేటట్లు నూరాలి. ఈమిశ్రమపదార్థాన్ని కడుపు పైన పట్టులాగా వేయాలి. ఇక్కడ మీరు ఈక్రింది విషయం గమనించాలి.
ప్లీహము చెడినప్పుడు కాలేయము మందగించి నప్పుడు కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బల్లరోగం వస్తుంది. అలా పెరిగిన పొట్టపైనగానీ, లేక సహ జంగా అతికొవ్వుతో పొట్ట తదితరభాగాలు ఎత్తుగా పెరిగినవారుగానీ పైన తెలిపినపట్టు ప్రతిరోజూ వేస్తుంటే పొట్ట కరిగిపోతుంది.