అనేకనొప్పులకు - అక్కలకర్ర
అక్కలకర్రవేరును దంచిపొడిచేసుకొని నిలువ వుంచుకోవాలి. రెండుమూడుచిటికెలు మోతాదుగా ఒకచెంచా తేనెతో కలిపి కొద్దికొద్దిగా నిదానముగా చప్పరించి తింటుంటే వెన్నునొప్పి, పిరుదులనొప్పి, పాదాలనొప్పులు, మోకాలునొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతయ్.
తుంటినొప్పికి - అశ్వగంధపొడి
అశ్వగంధపొడి పావుచెంచా మోతాదుగా రోజూ రెండు లేక మూడుపూటలా మంచినీటితో సేవిస్తూ వుంటే తుంటినొప్పి తగ్గిపోతుంది.